‘బ్రో’ సినిమా నుంచి పవన్ కల్యాణ్ అదిరిపోయే స్టిల్.. ఫొటో వైరల్

by Disha Web Desk 6 |
‘బ్రో’ సినిమా నుంచి పవన్ కల్యాణ్ అదిరిపోయే స్టిల్.. ఫొటో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ్‌లో భారీ విజయం సాధించిన సినిమా ‘వినోదయ సీతమ్’. రిమేక్ చిత్రంగా తెలుగులో ‘బ్రో’ టైటిల్‌తో తెరకెక్కుతుంది. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్- సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్నారు. దీనిని తమిళ డైరెక్టర్ సముద్రఖని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన పోస్టర్స్, టీజర్ మూవీపై ఫుల్ హైప్‌ని క్రియేట్ చేశాయి. తాజాగా, ఈ సినిమా నుంచి పవన్‌కు సంబంధించిన మరో పోస్టర్‌ను డైరెక్టర్ సముద్రఖని రివీల్ చేశారు. మూవీలోని ఓ పార్టీ సాంగ్‌లో పవన్ కల్యాణ్ సందడి చేశారు. అందులో కుడికాలిని గాల్లో లేపిన స్టిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, ‘బ్రో’ సినిమా జూలై 28న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది.

Also Read: ఏం అందంరా బాబు.. బ్రాలేకుండా బెడ్ పై రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ..

Next Story