- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pawan Kalyan : Allu Arjun కు స్పెషల్ విషెస్...
‘పుష్ప: ది రైజ్’లో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో మొదటిసారి ఉత్తమ జాతీయ నటుడిగా అల్లు అర్జున్ ఎంపికవడంతో ఇండస్ట్రీలోని ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ‘పుష్ప: ది రైజ్’లో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో మొదటిసారి ఉత్తమ జాతీయ నటుడిగా అల్లు అర్జున్ ఎంపికవడంతో ఇండస్ట్రీలోని ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. అల్లు అర్జున్‌కు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘69వ జాతీయ సినీ పురస్కారాలలో తెలుగు చిత్ర పరిశ్రమకు పలు విభాగాల్లో పురస్కారాలు దక్కడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తూ.. సినిమా రూపకల్పనలో నిమగ్నమయ్యే నటులు, రచయితలు, సాంకేతిక నిపుణుల ప్రతిభకు పట్టం కట్టేలా జాతీయ పురస్కారాలు ఉంటున్నాయి.
పుష్ప చిత్రానికిగాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా ఎంపిక కావడం అందరూ ఆనందించదగ్గ విషయం. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తొలిసారి ఉత్తమ నటుడు అవార్డుకి ఎంపికైన అల్లు అర్జున్‌కి హృదయపూర్వక అభినందనలు. పలు విభాగాల్లో అవార్డులు కైవసం చేసుకున్న ఆర్ఆర్ఆర్, ఉప్పెన, కొండపొలం చిత్ర బృందాలకు శుభాకాంక్షలు’’ అంటూ పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా అభినందించారు.
ఇవి కూడా చదవండి : Mega Star Chiranjeevi : Allu Arjun ను చూస్తే గర్వంగా ఉంది..






