Mega Star Chiranjeevi : Allu Arjun ను చూస్తే గర్వంగా ఉంది..

by Disha Web Desk 2 |
Mega Star Chiranjeevi : Allu Arjun ను చూస్తే గర్వంగా ఉంది..
X

దిశ, వెబ్‌డెస్క్: పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు రావడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ పెట్టారు. అంచెలంచెలుగా ఎదుగుతున్న అల్లు అర్జున్‌ను చూస్తే గర్వంగా ఉందని పేర్కొన్నారు. 69 ఏళ్లలో ఏనాడూ తెలుగు హీరోలకు దక్కని అవార్డును అల్లు అర్జున్ సాధించడం నిజంగా అభినందించదగ్గ విషయమన్నారు. అంతేకాదు.. ఈ 69వ జాతీయ అవార్డుల్లో ఏకంగా 6 అవార్డులను సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు. ఆస్కార్ అవార్డును సాధించిన జక్కన్న.. నేషనల్ అవార్డులనూ శాసించాడని ప్రశంసించారు. జాతీయ అవార్డులను సాధించిన ఉప్పెన, కొండపొలం చిత్రాలను కూడా చిరంజీవి అభినందించారు.

ఇవి కూడా చదవండి : అల్లు అర్జున్‌కు పవన్ కల్యాణ్ స్పెషల్ విషెస్



Next Story

Most Viewed