pawan kalyan on instagram : ఇది పవర్ స్టార్ రేంజ్.ఇండియాలోనే మొదటి వ్యక్తి!

by samatah |
pawan kalyan on instagram : ఇది పవర్ స్టార్ రేంజ్.ఇండియాలోనే మొదటి వ్యక్తి!
X

దిశ, వెబ్‌డెస్క్ : జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు, థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆయన ఫెయిల్యూర్ సినిమాలు కూడా స్టార్ హీరోల కలెక్షన్స్‌ను బీట్ చేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అంతే కాకుండా పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమాల్లో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు.రాజకీయ అంశాలను తరచూ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ప్రస్తావిస్తుంటారు. కాగా, నిన్న ( మంగళవారం) ఆయన తన ఇన్ స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక తాను ఎంట్రీ అయిన కొన్ని నిమిషాల్లోనే 1 మిలియన్ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నారు. ఇది భారతదేశ చరిత్రలోనే ఇది సెన్సేషనల్ రికార్డ్. ఈ ఘనత సాధించిన మొదటి హీరో విజయ్ కాగా, తెలుగులో పవన్ కళ్యాణ్‌కు మాత్రమే ఇది సాధ్యమైంది.ఇక ఇండియా లెవల్‌లో ఇలా ఫాలోవర్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసిన మొదటి స్థానంలో తమిళ స్టార్ విజయ్ ఉండగా, రెండో స్థానంలో పవన్ కళ్యాణ్ ఉండటం సెన్సేషనల్ రికార్డ్.

దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఒక్క పోస్ట్ పెట్టకుండానే ఇంతలా ఫాలోవర్స్ ను పొందడం మా హీరోకే సాధ్యమైంది. ఇది సార్ మా హీరో రేంజ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read More..

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న సమంత?

Niharika Divorce: చైతన్యతో విడిపోతానని నిహారికకు ముందే తెలుసా.. అందుకే ఆ పనికి ఇష్టపడలేదా?

Next Story

Most Viewed