- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tiger vs Pathaan:.. బాక్సాఫీసును బద్దలు కొట్టనున్న స్టార్ హీరోలు
బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో కలిసి నటిస్తే చూడాలని చాలా మంది అనుకున్నారు. అయితే ఇటీవల విడుదలైన ‘పఠాన్’ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించిన సీన్‌తో అభిమానుల కోరిక తీరినట్లైయింది. ఈ ఎపిసోడ్ కోసమే మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళ్లి చూశారని విశ్లేషకుల అంచనా.
అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఫుల్ లెంత్ మూవీలో నటిస్తే థియేటర్ల బద్దలవడం ఖాయం. తాజాగా, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ కలిసి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ‘పఠాన్ వర్సెస్ టైగర్’ సినిమా రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాను 2025 లో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో అది విన్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా సల్మాన్, షారుక్ కలిసి 1995లో ‘కరణ్ అర్జున్’ సినిమాలో నటించి సూపర్ హిట్ కొట్టారు. ఈ చిత్రం వచ్చి దాదాపు 28 సంవత్సరాలు అవుతోంది.
ఇవి కూడా చదవండి: రూ.40 కోట్లకు అమ్ముడుపోయిన ‘స్పై’ నాన్ థియేట్రికల్ రైట్స్






