రూ.40 కోట్లకు అమ్ముడుపోయిన ‘స్పై’ నాన్ థియేట్రికల్ రైట్స్

by Dishanational2 |
రూ.40 కోట్లకు అమ్ముడుపోయిన ‘స్పై’ నాన్ థియేట్రికల్ రైట్స్
X

దిశ, సినిమా: ‘కార్తికేయ 2’ బ్లాక్‌బస్టర్ తర్వాత పాన్ ఇండియా మూవీ ‘స్పై’తో వస్తున్నాడు నిఖిల్. గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కె రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సినిమాను వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. అలాగే ఈ మూవీ నాన్-థియేట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ ధరకు అమ్ముడైనట్లు వెల్లడించారు. అమెజాన్, స్టార్ నెట్‌వర్క్ కలిసి టోటల్ నాన్-థియేట్రికల్ హక్కులను రూ.40 కోట్లకు దక్కించుకోగా నిఖిల్‌ కెరీర్‌లో ఇదే హైయెస్ట్. కాగా నిఖిల్ సరసన ఐశ్వర్యా మీనన్ కథానాయికగా నటిస్తుండగా ఆర్యన్ రాజేష్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు.

ఇవి కూడా చదవండి: Tiger vs Pathaan:.. బాక్సాఫీసును బద్దలు కొట్టనున్న స్టార్ హీరోలు

Next Story

Most Viewed