- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒత్తిడిని దూరం చేసి, హాయిగా నవ్వించేలా మా సినిమా ఉంటుంది..
ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న అసలు సిసలైన పండుగ సినిమా ‘అనగనగా ఒక రాజు’(Anaganaga Oka Raju).

దిశ, సినిమా: ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న అసలు సిసలైన పండుగ సినిమా ‘అనగనగా ఒక రాజు’(Anaganaga Oka Raju). మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty) కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని.. సూర్యదేవర నాగవంశీ(Nagavamsi), సాయి సౌజన్య నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. సంక్రాంతికి వినోదాల విందుని అందించడానికి 2026, జనవరి 14న థియేటర్లలోకి వస్తోంది. తాజాగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించగా.. నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. ‘‘అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
మన ఒత్తిడిని దూరం చేసి, హాయిగా నవ్వించేలా మా సినిమా ఉంటుంది. ట్రైలర్‌కి మీ నుంచి వచ్చిన అద్భుతమైన స్పందన.. సినిమాపై మా నమ్మకాన్ని రెట్టింపు చేసింది. చాలా చాలా బాగుంది అంటూ అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. మీరు ఈ సినిమాపై చూపుతున్న ఆసక్తికి తగ్గట్టుగానే.. మిమ్మల్ని అలరించేలా ‘అనగనగా ఒక రాజు’ ఉంటుంది’’ అన్నారు. నాగవంశీ మాట్లాడుతూ.. ‘‘గోదావరి నేపథ్యంలో జరిగే ఒక అందమైన కథతో ఈ సినిమా రూపొందింది. నవీన్ శైలిలో చాలా సరదాగా ఉంటుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే పొలిటికల్ సెటైర్ ఎపిసోడ్ కూడా ఇందులో ఉంటుంది. ఈ చిత్రం ఎంత నవ్విస్తుందో.. అదే సమయంలో చివరిలో ఒక మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. కామెడీ, ఎమోషన్, ఫైట్, పాటలు ఇలా అన్ని అంశాలతో తెరకెక్కిన పండగ సినిమా ఇదని చెప్పారు.
READ MORE .....






