- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ప్రత్యేక అనుభూతిని మిస్ అవుతున్నందుకు బాధగా ఉంది: Niti Taylor
యంగ్ బ్యూటీ నితి టేలర్ తనకు ఇష్టమైన క్రిస్మస్ పండుగకు ఫ్యామిలీతో లేకపోవడం బాధగా ఉందని చెప్పింది..

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ నితి టేలర్ తనకు ఇష్టమైన క్రిస్మస్ పండుగకు ఫ్యామిలీతో లేకపోవడం బాధగా ఉందని చెప్పింది. ఈ మేరకు వర్క్ షెడ్యూల్ కారణంగా ఈ యేడాది వేడుకలు మిస్ అవుతున్నానన్న ఆమె.. కొన్ని రోజులముందే కుటుంబసభ్యులతో కలిసి గోవాలో క్రిస్మస్ పార్టీ జరుపుకున్నట్లు తెలిపింది. 'నేను తొమ్మిది నెలల తర్వాత అందరినీ కలిశాను. నా భర్తతో సహా! మరికొద్ది రోజుల్లో వారితోకలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటా. కానీ, ఈ యేడాది వరుస ప్రాజెక్టులతో బిజీ ఉండటం వల్ల ఏ కాస్త విరామ సమయం దొరికినా విలువైనదిగానే భావిస్తున్నా. ఇంట్లో తయారుచేసిన క్రిస్మస్ కేక్‌ను స్నేహితులతో పంచుకోవడం ప్రత్యేక అనుభూతి. అర్థరాత్రి చర్చికి వెళ్లి ప్రార్థనలు చేయడం మా ఆచారం. ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఇప్పుడు కూడా చేస్తాను. చిన్నప్పటినుంచి కోల్‌కతాలోని మా అమ్మమ్మ ఇంటికి వెళ్లానే ఇళ్లంతా లైట్లతో అలంకరించి మంచి వంటకాలు చేసుకుని విందు ఆరగించే అద్భుతమైన జ్ఞాపకాలను ఎన్నటికీ మరిచిపోలేను' అంటూ వివరించింది.
ఇవి కూడా చదవండి : ఆ రోజే దానితో ప్రేమలో పడ్డాను: హ్యూమా ఖురేషి






