- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ రోజే దానితో ప్రేమలో పడ్డాను: Huma Qureshi
లీవుడ్ నటి హ్యూమా ఖురేషి తన పదేళ్ల నటన జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అంతేకాదు ఫ్యామిలీలో తననే తెలివైన బిడ్డగా అందరూ భావించేవారని, దీంతో ఎడ్యుకేషన్ విషయంలోనూ చాలా సపోర్ట్ చేసినట్లు తెలిపింది.

దిశ, సినిమా : బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి తన పదేళ్ల నటన జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అంతేకాదు ఫ్యామిలీలో తననే తెలివైన బిడ్డగా అందరూ భావించేవారని, దీంతో ఎడ్యుకేషన్ విషయంలోనూ చాలా సపోర్ట్ చేసినట్లు తెలిపింది. తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'విద్య పరంగా నేను గొప్ప స్థాయికి ఎదుగుతాననుకున్నారు. కానీ, వాళ్లందరినీ నిరుత్సాహపరిచాను. అలాగే కళాశాలలో 'మహాభారత మహిళలు' అనే నాటకంతోనే నటనతో ప్రేమలో పడ్డాను. ఆ నాటికలో నటించడంతో పాటు దానికి దర్శకత్వం కూడా వహించాను. ఆ రోజుతోనే నా నటన ప్రయాణం ప్రారంభమైనట్లు భావించాను. నా ప్రతిభను మెచ్చిన ప్రేక్షకుల చప్పట్లు, ప్రశంసలే ఇటువైపు ఆకర్షించేలా చేశాయి. అప్పటి నుంచి ఎలాగైనా గొప్ప యాక్టర్ కావాలని కుస్తీ పడ్డాను. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను' అంటూ హ్యూమా చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : ఆ ప్రత్యేక అనుభూతిని మిస్ అవుతున్నందుకు బాధగా ఉంది: Niti Taylor






