‘జ‌వాన్’ మూవీకి నయనతార, దీపిక తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

by Disha Web Desk 10 |
‘జ‌వాన్’ మూవీకి నయనతార, దీపిక తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
X

దిశ, సినిమా: షారుఖ్‌ ఖాన్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘జ‌వాన్’. అట్లీ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. దీపికా పదుకొణే గెస్ట్ రోల్ చేస్తోంది. విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టిస్తున్నాడు. అయితే దాదాపు రూ. 200 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీలో యాక్టర్స్ రెమ్యూన‌రేష‌న్స్ హిందీ సినీ వ‌ర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. న‌య‌న్ రూ.11 కోట్లు తీసుకోగా.. దీపిక రూ.17 నుంచి రూ.20 కోట్ల వ‌ర‌కు అందుకున్నట్లు తెలిసింది. అలాగే విల‌న్‌గా న‌టించిన విజ‌య్ సేతుప‌తి రూ.21 కోట్ల రెమ్యూన‌రేష‌న్ తీసుకున్నట్లు సమాచారం. కాగా రిలీజ్‌కు ముందే ఈ సినిమా రూ. 400కోట్ల వ‌ర‌కు ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన‌ట్లు బాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాలు చెప్తున్నాయి.

Read More: ఆగస్టులో విడుదలకు సిద్ధంగా ఉన్న క్రేజీ మూవీస్ ఇవే


Next Story