విజయ్-శౌర్యువ్ ప్రాజెక్ట్‌కు క్లాప్ కొట్టిన నాని.. కొన్ని క్షణాలు శాశ్వతంగా మనతోనే ఉండిపోతాయంటూ దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-20 16:05:06  IST  )

కొన్ని క్షణాలు శాశ్వతంగా మనతోనే ఉండిపోతాయి. నాని గారి సాన్నిహిత్యం లభించడం నేను ఎప్పటికీ నా హృదయంలో దాచుకునే మధురానుభూతి.

విజయ్-శౌర్యువ్ ప్రాజెక్ట్‌కు క్లాప్ కొట్టిన నాని.. కొన్ని క్షణాలు శాశ్వతంగా మనతోనే ఉండిపోతాయంటూ దర్శకుడు ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించారు. ‘హాయ్ నాన్న’ వంటి విలక్షణమైన చిత్రంతో మెప్పించిన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ చిత్రం VDXShouryuv నేడు ఘనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ వేడుకకు నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా విచ్చేసి, చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ క్లాప్ కొట్టారు. తన గురువు లాంటి నాని ఈ వేడుకకు రావడంపై దర్శకుడు శౌర్యువ్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. "కొన్ని క్షణాలు శాశ్వతంగా మనతోనే ఉండిపోతాయి. నాని గారి సాన్నిహిత్యం లభించడం నేను ఎప్పటికీ నా హృదయంలో దాచుకునే మధురానుభూతి" అంటూ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు. అలాగే విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ 'గర్జన'లా కనిపిస్తారని, షూటింగ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని ఆయన పేర్కొన్నారు.వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఒక గ్లోబల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. దీని కోసం అంతర్జాతీయ స్థాయిలో పేరున్న టెక్నీషియన్లను రంగంలోకి దించడం విశేషం. అలెజాండ్రో మార్టినేజ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, హాలీవుడ్ స్థాయిలో పేరున్న ఎరిక్ డర్ట్స్ విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలను తీసుకున్నారు. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ‘ఖుషి’ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.

Read More.. వరుస ఫ్లాపులు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న రామ్ పోతినేని?



Next Story