- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుస ఫ్లాపులు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న రామ్ పోతినేని?
రామ్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దిశ, సినిమా: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం తన కెరీర్‌లో ఒక క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాలు దక్కడం లేదు. గతేడాది విడుదలైన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రం కూడా రామ్‌కు ఆశించిన బ్రేక్ ఇవ్వలేకపోయింది. దీంతో తన తదుపరి సినిమా విషయంలో రామ్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. మూవీ వచ్చి ఏడాది దాటినా ఇప్పటివరకు కొత్త ప్రాజెక్ట్ ప్రకటించకపోవడంతో అభిమానుల్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. రామ్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన కోసం ఒక విభిన్నమైన కథను రామ్ స్వయంగా సిద్ధం చేసుకున్నారట. అంతేకాదు, తన సొంత ప్రొడక్షన్ హౌస్‌లో, తానే దర్శకుడిగా మారి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని సమాచారం.
ఇది ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో సాగే కథ అని, దీనికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో రామ్ ప్రస్తుతం బిజీగా ఉన్నారని టాక్ నడుస్తోంది. రామ్ స్వయంగా మెగాఫోన్ పడుతుండటంపై నెటిజన్లు, అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సమయంలో, దర్శకత్వ బాధ్యతలు కూడా నెత్తి మీద వేసుకోవడం భారీ రిస్క్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఈ ప్రయోగం కనుక బెడిసికొడితే రామ్ సినీ కెరీర్ మరింత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రామ్ తన నటనపై దృష్టి పెట్టి, అనుభవం ఉన్న దర్శకుడితో సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు సలహా ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇంత పెద్ద నిర్ణయం అవసరమా? అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే, రామ్ తనపై తనకు ఉన్న నమ్మకంతో ఒక కొత్త తరహా సినిమాను అందించాలని పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది.






