తండ్రి కారణంగా ప్రేమించిన అమ్మాయిని వదులుకున్న నందమూరి హీరో

by Disha Web Desk 9 |
తండ్రి కారణంగా ప్రేమించిన అమ్మాయిని వదులుకున్న నందమూరి హీరో
X

దిశ, సినిమా: ఒకానొక సమయంలో వరుస ప్లాపులతో ఉన్న కళ్యాణ్ రామ్ గతేడాది ‘బింబిసార’, ‘అమిగోస్’ సినిమాలతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ‘డెవిల్’తో రాబోతున్నాడు. అయితే తాజాగా కళ్యాణ్ రామ్‌కు సంబంధించిన ఒక విషయం బయటకు వచ్చింది. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తన మూవీలో చేసిన ఓ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడట. అంతేకాదు ఆమెను వదిలిపెట్టి ఉండలేక.. తాను చేసే ఇతర సినిమాల షూటింగ్ స్పాట్‌లకు కూడా ఆమెను వెంట పెట్టుకుని తిరిగేవాడట. ఇక ఈ విషయం ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది నుంచి తెలుసుకున్న తండ్రి హరికృష్ణ.. ఆ హీరోయిన్ బ్యాగ్రౌండ్ తెలుసుకొని కళ్యాణ్ రామ్‌ని ఇంటికి పిలిపించి వార్నింగ్ ఇచ్చారట. అంతే కాదు ‘ఆ అమ్మాయితో తిరిగితే నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు’ అంటూ మొహం మీద చెప్పాడట. ఇక తండ్రి మాట కాదనలేక ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆమెకు బ్రేకప్ చెప్పేశాడట కళ్యాణ్ రామ్. కానీ ఆ హీరోయిన్ ఎవరనేది మాత్రం బయటకు రాలేదు.

ఇవి కూడా చదవండి : ఇటలీలో Varun Tej-Lavanya Tripati వెడ్డింగ్.. అటెండ్ కానున్న హీరోల లిస్ట్ ఇదే..



Next Story

Most Viewed