Nandamuri Harikrishna: బాలీవుడ్‌లో నందమూరి హరికృష్ణను అడుగు పెట్టకుండా అడ్డుకున్నది ఎవరో తెలుసా?

by Disha Web Desk 10 |
Nandamuri Harikrishna: బాలీవుడ్‌లో నందమూరి హరికృష్ణను అడుగు పెట్టకుండా అడ్డుకున్నది ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: నందమూరి హరి కృష్ణకు నాటకాలంటే చిన్నప్పటి నుంచి ఇష్టమట.గుడివాడలో శ్రీకష్ణ రాయభారం నాటకంలో శ్రీకృష్ణుని వేషం వేశారు. ఆ వేషం చూసిన దర్శకుడు పుండరీకాక్షయ్య శ్రీకృష్ణావతారం సినిమాలో చిన్ని కృష్ణుని వేషం ఇచ్చారు. అందులో కృష్ణుడిగా ఎన్టీఆర్ నటించారు. ఆ విధంగా సీనియర్ ఎన్టీఆర్‌తో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. హరికృష్ణ ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుంది.

హరికృష్ణ నటించిన తల్లా పెళ్ళామా సినిమాని హిందీలో బిడాయ్ గా తెరకెక్కించాలని నిర్ణయించిన ఎల్వి ప్రసాద్.. ఆ సినిమాలో హరికృష్ణనే తీసుకోవాలని అనుకున్నారట.. కానీ సీనియర్ ఎన్టీఆర్ ఒప్పుకోలేదట.. దీని గురించి హరికృష్ణ చెబుతూ 'నేను ఎవరిమాటా వినేవాడిని కాదు. కోపం వస్తే తిట్టేస్తా .. నాన్న గారికి ఎల్వీ ప్రసాద్ గారిని చాలా గౌరవిస్తారు. నా తొందర పాటులో ఏదైనా మాట జారి ఏమైనా అంటానేమోనని భయంతో వద్దన్నారు నాన్న'అని ఆయన మాటల్లో చెప్పుకొచ్చారు.

Read more:

నాగార్జున చేసిన ఆ చిన్న తప్పు వల్లనే నాగచైతన్య స్టార్ హీరో కాలేక పోయాడా?

Next Story

Most Viewed