నాగార్జున చేసిన ఆ చిన్న తప్పు వల్లనే నాగచైతన్య స్టార్ హీరో కాలేక పోయాడా?

by Dishanational2 |
నాగార్జున చేసిన ఆ చిన్న తప్పు వల్లనే నాగచైతన్య స్టార్ హీరో కాలేక పోయాడా?
X

దిశ, వెబ్‌డెస్క్ : అక్కినేని హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శివ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన నాగార్జున అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే నాగార్జున తర్వాత అక్కినేని వారసునిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య మాత్రం ఇప్పటికీ స్టార్ హీరో హోదా సంపాదించుకోవడం లేదు.

అయితే దీనికి కారణం నాగార్జునే అంటూ ఓ పుకారు నెట్టింట్లో తెగ షికారు చేస్తుంది. అసలు విషయంలోకి వెళ్తే.. నాగచైతన్య జోష్ సినిమాతో తెగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాడు. అయితే ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఆ తరువాత ఏం మాయ చేసావే మూవీ మంచి సక్సెస్ సాధించింది. కానీ ఆ తరువాత మాస్ హీరోగా ఎదగాలనే ప్రయత్నం చేసి విఫలం చెందాడు.

దీంతో నాగార్జున తనకు సెట్ అయ్యే క్లాస్ సినిమాలు చేయమని చెప్పడంతో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 100%లవ్ మంచి సక్సెస్ ని ఇచ్చింది. ఆ తర్వాత కూడా చైతూ క్లాస్ సినిమాలు తీసుకుంటూ వచ్చాడు.కొన్ని సినిమాలు హిట్ అయినా, స్టార్ హీరోగా మాత్రం పేరు రాలేదు. అయితే నాగార్జున క్లాస్ సినిమాలు చేయమని చెప్పడం వల్లనే నాగచైతన్య స్టార్ హీరోకాలేదంటూ నెట్టింట్లో ఓ రూమర్ తెగ వైరల్ అవుతుంది.

Also Read..

16 ఏళ్ల వయస్సులో సమంత ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!

Next Story