‘లెనిన్’ విషయంలో నాగార్జున కఠిన నిర్ణయం.. ఈ సారి మిస్ ఫైర్ అవ్వదు అంటూ నాగవంశీ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-30 04:33:24  IST  )

అక్కినేని అఖిల్(Akkineni Akhil), మురళీ కిషోర్ అబ్బూరి కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’.

‘లెనిన్’ విషయంలో నాగార్జున కఠిన నిర్ణయం.. ఈ సారి మిస్ ఫైర్ అవ్వదు అంటూ నాగవంశీ కామెంట్స్
X

దిశ, సినిమా: అక్కినేని అఖిల్(Akkineni Akhil), మురళీ కిషోర్ అబ్బూరి కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’. గత కొద్ది కాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న అఖిల్ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చాలా కష్టపడిపోతున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, మనం ఎంటర్ప్రైజెస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ(Nagavamsi), అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడదల కాబోతుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ ‘లెనిన్’ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘లెనిన్ మార్చిలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో అక్కినేని ఫ్యాన్స్ డెఫినిట్ గా హ్యాపీగా ఫీల్ అవుతారు.

నెక్స్ట్ వీక్ లో ఒక పాట వస్తుంది. అది చూసిన తర్వాత తప్పకుండా అభిమానులు ఆనందపడతారు. నాకు తెలిసి ఈ సినిమా మిస్ ఫైర్ అవ్వదు. నాగార్జున గారు కూడా రెండు భూతద్దాలు పెట్టుకొని తప్పులు వెతుకుతున్నారు. అన్ని విషయాల్లో జాగ్రత్త పడుతున్నారు. మ్యాగ్జిమమ్ ఫుటేజ్ వచ్చేసింది. రెండు మూడు బ్లాకులు చూశాను. సినిమాలోని మంచి ఎలిమెంట్స్ గురించి చెప్పి ఇప్పుడు హైప్ పెంచాలని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే 2025లో నేను అలా చెప్పినవి బ్యాక్ ఫైర్ అయ్యాయి. కానీ లెనిన్ వచ్చినప్పుడు కచ్చితంగా డిజప్పాయింట్ అవ్వరు’’ అన్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఎంత హిట్ అయినా స్టార్ కాలేడని దారుణంగా కామెంట్లు పెడుతున్నారు.

Read More..

రాజాసాబ్ ట్రైలర్‌పై టాలీవుడ్ హీరో ట్వీట్.. కుమ్మి పడేశారు ప్రభాస్ అన్నయ్య అంటూ..

Next Story