రాజాసాబ్ ట్రైలర్‌పై టాలీవుడ్ హీరో ట్వీట్.. కుమ్మి పడేశారు ప్రభాస్ అన్నయ్య అంటూ..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-12-30 04:06:12  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’(The Raja Saab) విడుదలకు సిద్ధంగా ఉంది.

రాజాసాబ్ ట్రైలర్‌పై టాలీవుడ్ హీరో ట్వీట్.. కుమ్మి పడేశారు ప్రభాస్ అన్నయ్య అంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’(The Raja Saab) విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను పూర్తి హారర్ కామెడీ జోనర్‌లో రూపొందించారు మేకర్స్.

దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. అయితే ఈ మూవీ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈక్రమంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీమ్ నిన్న రాజాసాబ్ నుంచి సెకెండ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్‌పై టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి స్పందిస్తూ ఎక్స్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు. ‘మన ట్రైలర్ వచ్చింది డార్లింగ్స్.

కుమ్మి పడేసారు ప్రభాస్ అన్నయ్య.. సంక్రాంతికి అతని ఈ అవతార్ చూడటానికి వేచి ఉండలేరు. ఆల్ ది బెస్ట్ టు దర్శకుడు మారుతి అన్నయ్య. మొత్తం టీమ్ యొక్క కృషి అన్ని ప్రతిఫలాలను తీసుకురావాలి. #RajaSaabని ఆస్వాదిద్దాం’ అంటూ రాసుకొస్తూ ట్రైటర్‌ను ట్యాగ్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. కాగా నవీన్ పొలిశెట్టి నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ మూవీ కూడా సంక్రాతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.

Link

Read More..

ప్రభాస్, పవన్‌ల నిజ స్వరూపం బయటపెట్టిన సుమ.. షాకింగ్ విషయాలు రివీల్ !

Next Story