ప్రభాస్, పవన్‌ల నిజ స్వరూపం బయటపెట్టిన సుమ.. షాకింగ్ విషయాలు రివీల్ !

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-30 05:35:34  IST  )

తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలు భారీ రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారంటూ తరచూ విమర్శలు వినిపిస్తుంటాయి.

ప్రభాస్, పవన్‌ల నిజ స్వరూపం బయటపెట్టిన సుమ.. షాకింగ్ విషయాలు రివీల్ !
X

దిశ, సినిమా: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలు భారీ రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారంటూ తరచూ విమర్శలు వినిపిస్తుంటాయి. సోషల్ మీడియాలో కొందరు అటెన్షన్ కోసం నిజాలు తెలుసుకోకుండా కామెంట్స్, ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇటీవల ఈ ట్రోలింగ్ మరింత ఎక్కువైంది. సినీ స్టార్స్ గురించి పలు పోస్టులు పెడుతూ ఫేమస్ అయిపోవాలని.. ఏది పడితే అది షేర్ చేసేస్తున్నారు. కానీ అదే హీరోలు సమాజానికి తిరిగి ఇస్తున్న సేవల గురించి మాత్రం చాలా అరుదుగా మాట్లాడతారు. వెలుగులోకి రాని ఎన్నో మంచి పనులు నిశ్శబ్దంగా జరుగుతుంటాయి. తాజాగా, టాలీవుడ్ టాప్ యాంకర్ సుమ కనకాల(Suma Kanakala) ఈ విషయంపై స్పందించి షాకింగ్ విషయాలు రివీల్ చేసింది. ఓ ఇద్దరు స్టార్ హీరోల గురించి చాలా మందికి తెలియని విషయాన్ని బయటపెట్టారు. ఖమ్మంలో ఒక వృద్ధాశ్రమం నిర్మాణానికి పవన్ కళ్యాణ్(Pawan Kalyan), ప్రభాస్‌(Prabhas)లు తనకు ఎంతో సహాయం చేశారని సుమ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఈ సేవా కార్యక్రమంలో వారితో పాటు మరికొందరు కూడా భాగస్వాములయ్యారని తెలిపారు. ముఖ్యంగా ప్రభాస్ ఆ వృద్ధాశ్రమంలో నివసిస్తున్న పెద్దవారి యోగక్షేమాల కోసం ప్రతినెలా ఆయన ఆర్థిక సహాయం అందిస్తున్నారని చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. ఎలాంటి ప్రచారం లేకుండా, ఎవరికీ తెలియకుండా ఇలాంటి సహాయాలు చేయడమే ప్రభాస్ దయ హృదయానికి నిదర్శనమని సుమ పేర్కొన్నారు.ఈ విషయాలు బయటకు రావడంతో అభిమానులు మాత్రమే కాదు, నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. వావ్ గ్రేట్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి, హీరోలు అంటే కేవలం సినిమాలు, రెమ్యునరేషన్లు మాత్రమే కాదు.. వారి వ్యక్తిత్వం, మనసు కూడా అంతే ముఖ్యమని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. తెరపై హీరోలుగా కనిపించే ప్రభాస్, పవన్ కళ్యాణ్‌లు.. నిజ జీవితంలోనూ ఎంతోమందికి ఆశ్రయంగా నిలుస్తున్నారన్న విషయం, వారికి ట్రోల్స్ చేసే వారికి ఒక గట్టి సమాధానంగా చెప్పుకోవచ్చు.

link

Read More..

రాజాసాబ్ ట్రైలర్‌పై టాలీవుడ్ హీరో ట్వీట్.. కుమ్మి పడేశారు ప్రభాస్ అన్నయ్య అంటూ..

Next Story