స్టైలిష్ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన నాగచైతన్య.. శోభిత మా అన్నకు దిష్టి తీయమ్మా అంటున్న ఫ్యాన్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-28 14:10:24  IST  )

అక్కినేని నాగచైతన్య(Akkineni Nagachaitanya) ‘జోష్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఆయన ‘ఏమాయ చేసావే’(Ye Maaya Chesave)తో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు.

స్టైలిష్ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన నాగచైతన్య.. శోభిత మా అన్నకు దిష్టి తీయమ్మా అంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Akkineni Nagachaitanya) ‘జోష్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఆయన ‘ఏమాయ చేసావే’(Ye Maaya Chesave)తో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. ఆ తర్వాత వరుస చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. అంతేకాకుండా పలు హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత(Samantha)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ కొద్ది కాలానికే విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక ఆ తర్వాత నుంచి శోభిత(Sobhitha Dhulipala)తో సీక్రెల్ రిలేషన్ మెయిన్‌టేన్ చేసిన చైతు గత ఏడాది రెండోపెళ్లి చేసుకున్నాడు. ఓ వైపు తన భార్యతో పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే సినిమాల్లోనూ నటిస్తున్నారు.

చాలా రోజుల నుంచి హిట్ కోసం తాపత్రయ పడుతున్న చైతు పెళ్లి తర్వాత ‘తండేల్’(Thandel) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలోనూ అప్పుడప్పుడు పలు ఫొటోలు షేర్ చేస్తున్నాడు. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేశాడు. కొద్దిగా బరువు తగ్గి.. హెయిర్ కట్ చేసి, గడ్డాన్ని ట్రిమ్ చేసి స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు శోభిత మా అన్నయ్య చైతన్యకు దిష్టి తీయమ్మా అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం మన్మధుడి కొడుకా మజాకా అని అంటున్నారు.

షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన సమంత.. అయ్యో ఏమైందంటూ ఆందోళన చెందుతున్న నెటిజన్లు

Next Story