Samantha: షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన సమంత.. అయ్యో ఏమైందంటూ ఆందోళన చెందుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-28 12:43:59  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ (Samantha) అందరికీ సుపరిచితమే. మయోసైటీస్ కారణంగా ఇండస్ట్రీకి దూరం అయింది.

Samantha: షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన సమంత.. అయ్యో ఏమైందంటూ ఆందోళన చెందుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ (Samantha) అందరికీ సుపరిచితమే. మయోసైటీస్ కారణంగా ఇండస్ట్రీకి దూరం అయింది. చివరగా ఆమె ‘ఖుషి’(KUSHI)మూవీలో కనపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులపాటు రెస్ట్ తీసుకుంది. ఇక ఇటీవల మళ్లీ నిర్మాతగా ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. ట్రాలాలా పిక్చర్స్‌పై ‘శుభం’ చిత్రాన్ని నిర్మించిన సమంత ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించింది. ఇక ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పర్లేదు అనిపించుకుంది. ప్రస్తుతం సమంత ఓ రెండు ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది కాలంగా సామ్ ఇండస్ట్రీకి దూరం అయినా యాడ్స్ చేస్తూ చేతినిండా సంపాదిస్తోంది.

అలాగే సోషల్ మీడియాలో పలు ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది. ఆమె పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. గత కొద్ది కాలంగా రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో డేటింగ్ చేస్తున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ పోతుంది. నెట్టింట ట్రోల్స్ ఎదురైనప్పటికీ ఏ మాత్రం బాధపడకుండా తన లైఫ్ తాను చూసుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోలు షేర్ చేస్తోంది. తాజాగా, సమంత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ డ్రెస్ట్ ధరించిన ఆమె స్లిమ్‌గా కనిపించి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఓమై గాడ్ అని షాక్ అవుతూ హార్ట్ సింబల్స్, ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు. అలాగే మరికొందరు ఆమె అంత సన్నగా అవడానికి కారణం మళ్లీ ఏమైనా హెల్ప్ ప్రాబ్లం అయి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.

స్టైలిష్ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన నాగచైతన్య.. శోభిత మా అన్నకు దిష్టి తీయమ్మా అంటున్న ఫ్యాన్స్

Next Story