- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శోభిత నేను ఆ కండీషన్ పెట్టుకున్నామంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టిన నాగచైతన్య..!
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) కొద్దికాలంపాటు శోభిత దూళిపాళ(Sobhita Dhulipala)తో డేటింగ్ చేశారు. సీక్రెట్‌గా కొన్ని రోజులు పలు చోట్ల ఎంజాయ్ చేశారు.

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) కొద్దికాలంపాటు శోభిత దూళిపాళ(Sobhita Dhulipala)తో డేటింగ్ చేశారు. సీక్రెట్‌గా కొన్ని రోజులు పలు చోట్ల ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి నిశ్చితార్ధం చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ విషయాన్ని నాగార్జున(Nagarjuna) ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక గత ఏడాది వీరిద్దరు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట ఓ వైపు పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే సినిమా కెరీర్‌పై ఫోకస్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ నేను శోభిత వర్క్ బిజీలో ఉండటం వల్ల కలిసి సమయం గడపలేకపోతున్నాము. అందుకే మా బంధాన్ని పెంచుకోవడం కోసం కొన్ని రూల్స్ పాటిస్తున్నాము.
మేమిద్దరం హైదరబాద్‌లో ఉంటే తప్పకుండా టిఫిన్, లంచ్, డిన్నర్ కలిసి తినాలని కండీషన్ పెట్టుకున్నాం. ఆదివారాల్లో మాత్రం మాకు నచ్చినట్లు ఉంటాం. షికారుకు వెళ్లడం నచ్చిన ఫుడ్ తినడం వంటివి చేసి మధుర జ్ఞాపకంగా మార్చుకుంటాం. శోభితకు బుక్స్ చదవడం ఇష్టం నాకు మాత్రం రేసింగ్ అంటే ఆసక్తి. ఇటీవల రేస్‌ట్రాక్‌పై డ్రైవింగ్ నేర్పించడంతో చాలా సంతోషపడింది. సెలవుల్లో ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటాం. ఒకసారి ఆమె చెప్పిన ప్రాంతానికే వెళ్తే మరోసారి నేను చెప్పిన చోటుకు వెళ్తాం’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, నాగచైతన్య సినిమాల విషయానికొస్తే.. చివరగా ‘తండేల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ‘NC-24’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Read More..
వివాహానంతరం మొదటిసారి పోస్ట్ పెట్టిన అఖిల్.. ఆకట్టుకుంటోన్న న్యూ కపుల్ క్యూట్ పిక్స్






