వివాహానంతరం మొదటిసారి పోస్ట్ పెట్టిన అఖిల్.. ఆకట్టుకుంటోన్న న్యూ కపుల్ క్యూట్ పిక్స్

by Kodari Anjali |   (  Updated:2025-06-28 05:18:11  IST  )

టాలీవుడ్ నటుడు అఖిల్ అక్కినేని తన చిరకాల ప్రేయసి జైనాబ్ను హైదరాబాద్లో హిందూ వేడుకలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

వివాహానంతరం మొదటిసారి పోస్ట్ పెట్టిన అఖిల్.. ఆకట్టుకుంటోన్న న్యూ కపుల్ క్యూట్ పిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటుడు అఖిల్ అక్కినేని తన చిరకాల ప్రేయసి జైనాబ్ను హైదరాబాద్లో హిందూ వేడుకలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. జైనాబ్.. సౌదీకి చెందిన వ్యాపారవేత్త జుల్ఫీ రాష్ట్ర కుమార్తె అన్న విషయం తెలిసిందే. అఖిల్ అండ్ జైనాబ్ జూన్ 6 వ తారీకున ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. శుక్రవారం జూబ్లిహిల్స్ లోకి నాగార్జున నివాసంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

దీంతో అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. పలువురు సినీ ప్రముఖులు అఖిల్ పెళ్లికి హాజరై సందడి చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇకపోతే వీరిద్దరు గత ఏడాదే నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఈ విషయాన్ని వీరు నవంబరు 26వ తేదీన అఖిల్తో పాటు తల్లి అమల అండ్ తండ్రి నాగార్జున సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

ఇప్పటికి కూడా అఖిల్ అండ్ జైనాబ్ పెళ్లి, రిసెప్షన్ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ వంటి ప్రముఖులు హాజరయ్యారై సందడి చేశారు. అయితే వివాహానంతరం అఖిల్ అండ్ జైనాబ్ మొదటిసారి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు పంచుకుని.. ‘‘జూన్ 6, 2025 నా జీవితంలోని అత్యుత్తమ రోజు. కాగా కొన్ని క్షణాలను పంచుకోవాలని నా హృదయం భావించింది. ఈ జ్ఞాపకాలను చాలా అందంగా బంధించినందుకు @eshantrajuphotography @khushbooguptaoguri కి ధన్యవాదాలు’’. అని రాసుకొచ్చారు. ప్రస్తుతం న్యూ కపుల్ క్యూట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story