సునీల్ విషయంలో చైతన్యకు క్లాస్ పీకిన నాగార్జున..?

by Disha Web Desk 13 |
సునీల్ విషయంలో చైతన్యకు క్లాస్ పీకిన నాగార్జున..?
X

దిశ, సినిమా: అక్కినేని నాగ చైతన్య, సునీల్ హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ ‘తడాఖా’. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ గురించి తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో చైతన్య హీరో కాగా తనకు అన్నయ్యగా ఎవరిని తీసుకోవాలనే చర్చలో సునీల్ పేరును డైరెక్టర్ డాలీ సూచించాడట. కానీ ‘సునీల్ పక్కన నేను చెయ్యడమేంటి. అతను నాతో సరిసమానమైన హీరోనా? అతన్ని పెడితే నేను సినిమా చెయ్యను’ అని డైరెక్టర్‌తో చైతూ అన్నాడట.

దీంతో ఈ విషయం నాగార్జున వరకూ వెళ్లగా.. ‘అతనితో చేస్తే నీ విలువ ఎందుకు తగ్గుతుంది. సునీల్ హీరోగా రూ.30 కోట్లు రాబట్టాడు. నీకు అలాంటి సినిమా ఉందా? ఎవరినీ తక్కువ చేసి మాట్లాడకూడదు’ అని గట్టిగా క్లాస్ పీకాడట. ఆ తర్వాత సునీల్‌ను ఇంటికి పిలిచి చైతన్యతో సారీ చెప్పించారట.

ఇవి కూడా చదవండి:

అఖిల్ కోసం క్యూ కడుతున్న స్టార్ డైరెక్టర్స్.. సక్సెస్ అందించేనా?

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల.. ఫ్యాన్స్‌కు పూనకాలే (వీడియో)



Next Story

Most Viewed