Anasuya: అటెన్షన్ కోసం పరువు తీసుకున్నావంటూ నెటిజన్ పోస్ట్.. స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన అనసూయ

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-09 04:08:15  IST  )

‘దండోరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా యాక్టర్ శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే.

Anasuya: అటెన్షన్ కోసం పరువు తీసుకున్నావంటూ నెటిజన్ పోస్ట్.. స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన అనసూయ
X

దిశ, సినిమా: ‘దండోరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా యాక్టర్ శివాజీ (Shivaji)చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. మహిళల అందం అనేది చీరకట్టు, ఒళ్లు కనిపించని దుస్తులకే పరిమితం కావాలంటూ ఆయన చేసిన కామెంట్స్‌ను చాలా మంది తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యంగా “మోడ్రన్ డ్రెస్సుల్లో సామాన్లు చూపించకండి” అన్న మాటలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఈ వ్యాఖ్యలపై నటి అనసూయ(Anasuya) గట్టిగా రియాక్ట్ అయింది. శివాజీ వ్యాఖ్యలను మహిళా స్వేచ్ఛకు విరుద్ధమని పేర్కొంటూ వరుసగా పోస్టులు పెడుతూ తన అసహనాన్ని వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే అనసూయ, ఈ విషయంలో మరింత అగ్రెసివ్‌గా స్పందించడంతో విషయం మరింత పెద్దదైంది.

ఆమె విమర్శలకు మద్దతు లభించినప్పటికీ, మరోవైపు తీవ్ర ట్రోలింగ్‌ను కూడా ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో ఓ నెటిజన్ “అటెన్షన్ కోసం సంబంధం లేకుండా మధ్యలో దూరి విషయాన్ని పెద్దది చేసి, పరువు తీసుకుని నెగెటివ్‌గా మారడం అవసరమా?” అంటూ వ్యాఖ్యానించాడు. దీనికి అనసూయ వెనుకాడకుండా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. “ఎవరి పరువు పోయింది.మా తల్లిదండ్రులు.. నా కుటుంబ సభ్యులు ఇచ్చింది నా దగ్గరే ఉంది. మీరు ఏదో లోకంలో ఉన్నారు. నేనేమీ నెగెటివ్ కాలేదు. నా పరువు నా దగ్గరే భద్రంగా ఉంది” అంటూ ఆమె ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి శివాజీ వ్యాఖ్యలతో మొదలైన ఈ వ్యవహారం, అనసూయ స్పందనలతో సోషల్ మీడియా వార్‌గా మారిపోయింది. మహిళల దుస్తులు, వ్యక్తిగత స్వేచ్ఛపై చర్చను మరోసారి తెరపైకి తీసుకొచ్చిన ఈ వివాదం ప్రస్తుతం తెలుగు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా కొనసాగుతోంది.

Read More..

మహిళల భద్రత గురించి శివాజీ మాట్లాడిన విధానం వెనుక ఉన్న ఉద్దేశం మంచిదే.. అనసూయ షాకింగ్ కామెంట్స్

Next Story