మహిళల భద్రత గురించి శివాజీ మాట్లాడిన విధానం వెనుక ఉన్న ఉద్దేశం మంచిదే.. అనసూయ షాకింగ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2026-01-08 07:15:16  IST  )

దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యాక్టర్ శివాజీ అందం చీరకట్టులో, ఒళ్లు కనిపించకుండా వేసుకునే బట్టల్లోనే ఉంటుంది. అలా కాకుండా అభ్యంతరకరంగా బట్టలు వేసుకుంటే అందులో విలువేముంటుంది? అంటూ చేసిన కామెంట్స్‌ తీవ్ర దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే.

మహిళల భద్రత గురించి శివాజీ మాట్లాడిన విధానం వెనుక ఉన్న ఉద్దేశం మంచిదే.. అనసూయ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యాక్టర్ శివాజీ అందం చీరకట్టులో, ఒళ్లు కనిపించకుండా వేసుకునే బట్టల్లోనే ఉంటుంది. అలా కాకుండా అభ్యంతరకరంగా బట్టలు వేసుకుంటే అందులో విలువేముంటుంది? అంటూ చేసిన కామెంట్స్‌ తీవ్ర దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. అయితే శివాజీ వ్యాఖ్యలపై యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌ తీవ్రంగా స్పందించారు. అంతేకాకుండా ఈరోజు వరకు దాని గురించి ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఉన్నది. ఈ క్రమంలో తాజాగా శివాజీ వ్యాఖ్యలపై అనసూయ మరోసారి స్పందించింది.

ఇన్‌స్టాలో ఓ నెటిజన్.. మేడమ్ శివాజీ చెప్పిన పాయింట్ కరెక్ట్ కానీ అతను వాడిన రెండు పదాలు మాత్రం బ్యాడ్‌గా ఉన్నాయి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడుగగా.. దానికి ఆమె స్పందిస్తూ.. ‘శివాజీ ఎంతో కష్టపడి, మంచి పాత్రలు పోషించి, ప్రజలు తన మాట వినే స్థాయికి చేరుకున్నారు.. మహిళల భద్రత గురించి ఆయన మాట్లాడిన విధానం వెనుక ఉన్న ఉద్దేశం మంచిదే.. కానీ కేవలం అమ్మాయిలను హెచ్చరించడమే కాకుండా, అబ్బాయిలకు కూడా బాధ్యతను గుర్తుచేసేలా మాట్లాడి ఉంటే బాగుండేది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Link

Read More..

‘నేను తప్పు చేశాను.. క్షమించండి రాశి గారు’.. అనసూయ పోస్ట్

Next Story