‘నేను తప్పు చేశాను.. క్షమించండి రాశి గారు’.. అనసూయ పోస్ట్

by Gantepaka Srikanth |

నటుడు శివాజీ - యాంకర్ అనసూయ ఎపిసోడ్‌లోకి సీనియర్ నటి రాశి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

‘నేను తప్పు చేశాను.. క్షమించండి రాశి గారు’.. అనసూయ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: నటుడు శివాజీ(Actor Shivaji) - యాంకర్ అనసూయ(Anchor Anasuya) ఎపిసోడ్‌లోకి సీనియర్ నటి రాశి(Raashi) ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయపై వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లు ధరించే బట్టల గురించి శివాజీ మాట్లాడారు. శివాజీ మాట్లాడింది తప్పే.. దానిని నేను సమర్థించను. కొన్ని వాడకూడని పదాలు వాడారు. కానీ అలా మాట్లాడినందుకు ఆయనే బాధపడ్డారు. క్షమాపణలు కూడా చెప్పారు. ఇది పక్కన పెడితే గతంలో అనసూయ కూడా నన్ను ట్రోల్ చేశారు. ఓ టీవీ షోలో రాశిఫలాలు అని అనసూయ కామెంట్ చేశారు. అప్పుడే ఆమెపై చట్టపరంగా వెళ్లాలని అనుకున్నాను. కానీ మా అమ్మ చెప్పిందని మౌనంగా ఉన్నాను అని రాశి చెప్పుకొచ్చారు. ఈ వీడియో వైరల్ కావడంతో అనసూయ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెబుతూ పోస్టు పెట్టారు.

‘‘డియర్ రాశి గారు.. మూడు సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో "తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్‌లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటే.. దీనికి సారీ చెబుతున్నాను. ఆ షోలో ద్వంద్వార్ధపు మాటలని ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచి పెట్టడం వరకు నాలోని ఆ మార్పు మీరు గమనించవచ్చు. ఈరోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి ఇప్పుడు కొందరు కావాలని వైరల్ చేస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను. ఆ కార్యక్రమం దర్శక రచయిత నిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణ చెప్తున్నాను’’ అని అనసూయ ఎక్స్‌లో పేర్కొన్నారు.

Next Story