నా కల నిజమైనట్లుగా అనిపిస్తోంది.. ‘వృషకర్మ’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన చైతూ

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-16 07:07:38  IST  )

అత్యాధునిక సాంకేతికతతో ఈ అద్భుత ప్రపంచాన్ని తెరపై చూపించడం నా కల నిజమైనట్లుగా అనిపిస్తోంది.

నా కల నిజమైనట్లుగా అనిపిస్తోంది.. ‘వృషకర్మ’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన చైతూ
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. 'తండేల్' సినిమాకు గాను 2025 ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్న చైతూ, ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'వృషకర్మ' తో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఇందులో ఆయన మునుపెన్నడూ చూడని విధంగా ఒక అడ్వెంచరస్ ట్రెజర్ హంటర్‌గా కనిపించనున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూ ఈ సినిమా గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. "నేను ఎప్పటి నుంచో ఒక భారీ స్థాయి మైథాలజీ కథలో భాగం కావాలని కోరుకున్నాను. మన దేశపు మట్టి కథలు, పురాణాల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. అత్యాధునిక సాంకేతికతతో ఈ అద్భుత ప్రపంచాన్ని తెరపై చూపించడం నా కల నిజమైనట్లుగా అనిపిస్తోంది" అని తన సంతోషాన్ని పంచుకున్నారు. ఇక ఈ పాత్ర కోసం చైతన్య తన లుక్‌ను పూర్తిగా మార్చేసిన విషయం తెలిసిందే.

తన రిప్డ్ ఫిజిక్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ విషయంపై యాంకర్ ప్రశ్నించగా.. "నేను పర్సనల్‌గా ఫిట్‌నెస్‌ను బాగా ఇష్టపడతాను. గత సినిమాల్లో బాడీ చూపించే అవకాశం రాలేదు, కానీ ఇందులో ట్రెజర్ హంటర్ పాత్ర కావడంతో నా ఫిట్‌నెస్‌ను కూడా ఒక ఆయుధంగా వాడుకున్నాను" అని చైతన్య తెలిపారు. క్యూట్ నుంచి హాట్‌గా మారారనే కామెంట్స్ పై స్పందిస్తూ.. రెండింటిలోనూ నేను 'రెలవెంట్' గా ఉండాలనుకుంటున్నానని అన్నారు. ఇక 'వృషకర్మ'కు సీక్వెల్ ఉంటుందా అన్న ప్రశ్నకు.. సమాధానమిస్తూ.. "మొదటి భాగం సక్సెస్ మీద సీక్వెల్ అనేది ఆధారపడి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం నాగచైతన్య కామెంట్స్ వైరల్ అవుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా కనిపించనుంది.

విజయ్ వర్సెస్ పవన్.. ఉస్తాద్ ఈవెంట్‌లో మొదలైన అసలైన పొలిటికల్ వార్!

Next Story