విజయ్ వర్సెస్ పవన్.. ఉస్తాద్ ఈవెంట్‌లో మొదలైన అసలైన పొలిటికల్ వార్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-16 14:59:59  IST  )

విజయ్ సినిమా ‘జన నాయగన్’ వాయిదా పడటం, దాని వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయనే వార్తలపై పవన్ స్పందిస్తూ.. నియమ నిబంధనలు అందరికీ ఒకటేనని స్పష్టం చేశారు.

విజయ్ వర్సెస్ పవన్.. ఉస్తాద్ ఈవెంట్‌లో మొదలైన అసలైన పొలిటికల్ వార్!
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాబోయే సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ వేదికగా అటు సినిమాలపై, ఇటు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తమిళ స్టార్ విజయ్ రాజకీయ రంగప్రవేశం, ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పవన్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. తమిళనాడులో విజయ్ సినిమా ‘జన నాయగన్’ వాయిదా పడటం, దాని వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయనే వార్తలపై పవన్ స్పందిస్తూ.. నియమ నిబంధనలు అందరికీ ఒకటేనని స్పష్టం చేశారు. "నేను ఎన్డీయే (NDA) కూటమిలో ఉన్నప్పటికీ, నా సినిమా ‘OG’కి సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికేట్ ఇచ్చింది. నా నిర్మాతలు అడిగితే.. రాజకీయ పరపతిని సినిమాల కోసం వాడకూడదని చెప్పాను" అని పవన్ గుర్తు చేశారు.

విజయ్ పార్టీ మీటింగ్‌లకు అనుమతి దక్కకపోవడంపై మాట్లాడుతూ, గతంలో తాను కూడా ఇలాంటి అడ్డంకులను ఎన్నో చూశానని తెలిపారు. విజయ్‌తో పొత్తు గురించి వస్తున్న వార్తలను పవన్ కొట్టిపారేశారు. "నేను విజయ్‌ని కలిసి 25 ఏళ్లు అయ్యింది. ఆయన ఒంటరిగా వెళ్తారా లేదా కూటమితో కలిసి వెళ్తారా అనేది ఆయన వ్యక్తిగత నిర్ణయం" అని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చే వారు తక్షణ ఫలితాలు ఆశించకూడదని, కనీసం పదేళ్ల పాటు ప్రజల్లో ఉంటూ పోరాటం చేసే సత్తా ఉండాలని హితవు పలికారు. రాజకీయం అంటే కేవలం అధికారం కాదని, అదొక నిరంతర పోరాటమని పవన్ వ్యాఖ్యానించారు.

Pawan Kalyan:గ‌బ్బ‌ర్ సింగ్ రేంజ్ లో ఉస్తాద్ భ‌గత్ సింగ్ హిట్ అవుతుంది

Next Story