Pawan Kalyan:గ‌బ్బ‌ర్ సింగ్ రేంజ్ లో ఉస్తాద్ భ‌గత్ సింగ్ హిట్ అవుతుంది

by velandi.Saikiran |   (  Updated:2026-03-16 14:59:40  IST  )

గబ్బర్ సింగ్ తరహాలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా బంపర్ హిట్ అవుతుందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Pawan Kalyan:గ‌బ్బ‌ర్ సింగ్ రేంజ్ లో ఉస్తాద్ భ‌గత్ సింగ్ హిట్ అవుతుంది
X

దిశ‌, వెబ్ డెస్క్: గబ్బర్ సింగ్ తరహాలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా బంపర్ హిట్ అవుతుందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ సినిమా కథ జనాలందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. మార్చి 19వ తేదీన ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఉస్తాద్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రం బృందం. యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

సినిమా తనకు అన్నం పెట్టిందని.. ఈ చిత్ర పరిశ్రమలో తాను కూడా ఒక భాగం కావడం గొప్ప విషయం అని ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా కోసం కష్టపడ్డ వాళ్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీ లీల డాన్స్ తక్కువగా చేస్తుందని.. ఎక్కువగా న‌ట‌న‌తో ఇరగదీస్తుందని స్పష్టం చేశారు. ఇక తన సినిమా అని చెప్పగానే, క‌థ‌ కూడా వినకుండా రాశి ఖ‌న్నా ఒప్పుకున్నారని ప్రశంసించారు. ఇలాంటి వాళ్లు ఇండస్ట్రీకి అవసరమని వ్యాఖ్యానించారు. కాగా పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా దర్శకుడిగా హరిష్ శంకర్ వ్యవహరించారు. హీరోయిన్లుగా రాశి ఖ‌న్నా, శ్రీ లీల మెరువనున్నారు.

Pawan Kalyan:ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల డ్యాన్స్ ఉండ‌దు !

Next Story