Pawan Kalyan:ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల డ్యాన్స్ ఉండ‌దు !

by velandi.Saikiran |

ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల డ్యాన్స్ ఉండ‌దని, యాక్టింగ్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని తెలిపారు హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

Pawan Kalyan:ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల డ్యాన్స్ ఉండ‌దు !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ( Ustaad Bhagat Singh) హీరోయిన్ శ్రీలీలకు ఎక్కువగా డ్యాన్స్ ఉండబోదని, కథకు అనుగుణంగా ఆమె నటన ఉంటుందని తెలిపారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆదివారం ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీలకు డ్యాన్స్ తక్కువగా ఉండేలా దర్శకుడు హరీష్ శంకర్ ప్లాన్ చేశాడని తెలిపారు.

గబ్బర్ సింగ్ రేంజ్ లో ఉస్తాద్ భగత్ సింగ్ హిట్

కానీ కథకు తగ్గట్టుగా ఆమె నటన అద్భుతంగా ఉంటుందని వివరించారు. శ్రీ లీల డ్యాన్స్ తక్కువగా ఉందని ఎవరు బాధపడకూడదని పరోక్షంగా హింట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇక కథ వినకుండానే తనతో యాక్ట్ చేసేందుకు హీరోయిన్ రాశి ఖ‌న్నా ఒప్పుకున్నారని, ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గబ్బర్ సింగ్ రేంజ్ లో ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ అవుతుందని కూడా సంచలన ప్రకటన చేశారు.

తనకు సినిమా అంటే చాలా ఇష్టమని.. సినిమానే తనకు అన్నం పెట్టిందని గుర్తు చేశారు. తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్లడం చాలా గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనది చిన్న భాగం మాత్రమే అని తెలిపారు. అయినప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో తాను ఉండడం గొప్ప విషయమని సంతోషం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. కాగా పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తుండగా శ్రీ లీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా మెరువనున్నారు. మార్చి 19వ తేదీన ఉగాది కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

Next Story