నా కూతురు కళాకారులను అవమానించదు ఆ పోస్టులు నమ్మొద్దు.. సారా అర్జున్ తండ్రి ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-09 06:14:15  IST  )

సారా అర్జున్‌కు ఎక్స్ (ట్విట్టర్)లో అసలు ఖాతానే లేదు. ఆమెకు కేవలం ఇన్‌స్టాగ్రామ్ మాత్రమే ఉంది.

నా కూతురు కళాకారులను అవమానించదు ఆ పోస్టులు నమ్మొద్దు.. సారా అర్జున్ తండ్రి ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ సారా అర్జున్(Sara Arjun) ప్రస్తుతం తన కెరీర్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన ఈ బ్యూటీ, రణవీర్ సింగ్‌తో కలిసి నటించిన ‘ధురంధర్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ఉగాది కానుకగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. అయితే, సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న సమయంలో సారా అర్జున్ ఒక అనవసర వివాదంలో చిక్కుకుంది. ఆమె పేరుతో కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు సృష్టించడమే దీనికి కారణం. సారా అర్జున్ పేరుతో ఉన్న ఒక నకిలీ ఖాతా నుంచి ఇండస్ట్రీలోని ఇతర నటీనటులను కించపరిచేలా కొన్ని పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. ‘సారా పేరుతో టాక్సిసిటీ లేదు, కేవలం ధురంధరం మాత్రమే’ అంటూ కొందరు నెగిటివ్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇది కాస్తా వైరల్ కావడంతో సారాపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ మొదలైంది.

విషయం తెలుసుకున్న సారా తండ్రి రాజ్ అర్జున్(Raj Arjun) వెంటనే స్పందించి, ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ‘‘సారా అర్జున్‌కు ఎక్స్ (ట్విట్టర్)లో అసలు ఖాతానే లేదు. ఆమెకు కేవలం ఇన్‌స్టాగ్రామ్ మాత్రమే ఉంది. మిగిలిన సోషల్ మీడియా వేదికల్లో ఆమె పేరుతో ఉన్నవన్నీ ఫేక్ అకౌంట్లే" అని ఆయన స్పష్టం చేశారు. సారా ప్రతి కళాకారుడిని, ప్రతి సినిమాను గౌరవించేలా పెరిగిందని, ఇండస్ట్రీని ఒక పెద్ద కుటుంబంలా భావిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. కేవలం తన సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం ఎదుటివారిని తక్కువ చేసి అవమానించే వ్యక్తి సారా కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని, వాటిని వ్యాప్తి చేయవద్దని ఆయన అభిమానులను కోరారు. ఉగాదికి విడుదల కాబోతున్న ‘ధురంధర్’ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్న సమయంలో, ఇలాంటి ఫేక్ పోస్టుల వల్ల సినిమాకు ఇబ్బంది కలగకుండా ఆయన ముందుగానే అప్రమత్తమయ్యారు.

ఎన్టీఆర్ కామెంట్స్‌తో అనసూయ మైండ్ బ్లాక్.. చర్చనీయాంశంగా మారిన పోస్ట్

Next Story