- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్టీఆర్ కామెంట్స్‌తో అనసూయ మైండ్ బ్లాక్.. చర్చనీయాంశంగా మారిన పోస్ట్

దిశ, సినిమా: మహిళా దినోత్సవం సందర్భంగా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్లిన తారక్, అక్కడ ఆసుపత్రి సిబ్బందితో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో మహిళల గౌరవం గురించి ఆయన చెప్పిన మాటలు అందరి మనసు గెలుచుకుంటున్నాయి. వేడుకలో భాగంగా ఒక డాక్టర్ ‘ప్రస్తుత సమాజంలో మహిళలను ఎలా గౌరవించాలో చెప్పండి’ అని అడగ్గా.. ఎన్టీఆర్ చాలా పరిణతితో సమాధానమిచ్చారు. ‘‘నిజం చెప్పాలంటే, మహిళలను ఎలా గౌరవించాలో మనం పదే పదే గుర్తు చేస్తూ ఉండటం నాకు అస్సలు నచ్చదు.
ఎందుకంటే ఆ గౌరవం అనేది మన పుట్టుకతోనే రావాలి. అది మన రక్తంలోనే ఉండాలి’’ అని ఆయన స్పష్టం చేశారు. కేవలం విమెన్స్ డే రోజునే కాదు, ప్రతిరోజూ వారిని గౌరవించడం సహజంగా జరగాలని తారక్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నేటి తరం తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంట్లోనే సరైన విలువలను నేర్పించాలని ఎన్టీఆర్ సూచించారు. ‘మనం మన పిల్లలకు ఇంట్లోనే మహిళలను గౌరవించేలా విద్యాబుద్ధులు నేర్పాలి. నా ఇద్దరు కుమారులను (అభయ్ రామ్, భార్గవ్ రామ్) కచ్చితంగా మహిళల పట్ల గౌరవం కలిగి ఉండేలాగే పెంచుతానని నేను మీకు ఈ వేదికగా మాటిస్తున్నాను’’ అని ఆయన ప్రకటించారు.
ఒక తండ్రిగా ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ మాట్లాడిన ఈ వీడియో చూసిన ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు మైండ్ బ్లాక్ అయిపోయింది. సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యారు. ఆ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘మహిళల గురించి ఒక స్టార్ హీరో ఇంత గొప్పగా మాట్లాడటం చూడటం చాలా ఆనందంగా ఉంది. థాంక్యూ ఎన్టీఆర్ గారు’’ అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇక తారక్ లాంటి పెద్ద స్టార్ ఇలాంటి సందేశాన్ని ఇవ్వడం వల్ల సమాజంలో మంచి మార్పు వస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.






