'No Makeup' Selfie తో దర్శనమిచ్చిన Mira Rajput.. అందానికి Netizens ఫిదా!

by Disha Web Desk 10 |
No Makeup Selfie తో దర్శనమిచ్చిన Mira Rajput.. అందానికి Netizens ఫిదా!
X

దిశ, సినిమా : షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్ మరోసారి అభిమానులను అలరించింది. ఎల్లప్పుడూ ఏదోఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో సోషల్ మీడియాలో సందడి చేసే నటి..తాజాగా మరో బ్యూటీఫుల్ పిక్‌తో దర్శనమిచ్చి ఆశ్యర్యపరిచింది. ఈ మేరకు 'ఈజ్ ఇట్ మేకప్..వెన్ ఇట్స్ ఆల్వేజ్ నో మేకప్' అనే హ్యాష్ ట్యాగ్‌తో కూడిన ఫేస్ సెల్ఫీని నెట్టింట షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. దీంతో మీరా మేకప్ వేసుకుందో లేదో చెప్పాలంటూ నెటిజన్లు పోటాపోటిగా చర్చకు దిగారు. మేకప్ వేయలేదని కొందరంటే కొద్దిగా వేసిందని మరికొందరు వాదిస్తున్నారు. ఐలైనర్, లిప్‌స్టిక్, మాయిశ్చరైజర్‌ను అప్లై చేయడం వల్ల నో మేకప్ లుక్‌ కనిపిస్తుందని, అయినప్పటికీ స్పష్టత లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరో అభిమాని 'నో మేకప్' లుక్ అసలు అర్థాన్ని చెబుతూ..'నో మేకప్ లుక్' అంటే..ఎలాంటి మేకప్ లేకుండా ముఖం కడుక్కోవడం మాత్రమే' అని ఫన్నీగా స్పందించడం విశేషం. కాగా మొత్తానికి మీరాను చాలా అందంగా ఉన్నావంటూ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : విడాకుల తర్వాత Samanthaకు మిగిలిన ఆస్తులు ఎన్నో తెలుసా?

Next Story

Most Viewed