- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విడాకుల తర్వాత Samanthaకు మిగిలిన ఆస్తులు ఎన్నో తెలుసా?
సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకొని విడిగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే సామ్ చై కలిసి ఉన్న సమయంలో ఓ ప్లాట్ కొనుగోలు

దిశ, వెబ్‌డెస్క్ : సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకొని విడిగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే సామ్ చై కలిసి ఉన్న సమయంలో ఓ ప్లాట్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. విడాకుల అనంతరం ఆ బంగ్లా ఎవరి వద్ద కొనుగోలు చేశారో వారికే అమ్మేసింది.
అయితే తాజాగా సమంత ఆస్తులకు సబంధించిన మరో వార్త నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది. సమంతకు విడాకుల తర్వాత ఇన్ని ఆస్తులున్నాయని ఓ నివేదిక వైరల్ గా మారింది. అందులో.. సమంత చైతో ఉన్న ప్పుడు తీసుకున్న బంగ్లానే, విడాకుల అనంతరం మళ్లీ కొనుగోలు చేసిందంట. దాని విలువ దాదాపు కోటిపైనే ఉంటుందంట. పలు నివేదికల ప్రకారం 2022 వరకు సమంత ఆస్తుల నికర విలువ రూ.97 కోట్లు ఉన్నట్లు సమాచారం. సామ్ వార్షిక ఆదాయం ప్రకారం ఆమె నెలకు 8 కోట్ల వరకు సంపాదిస్తుందంట. ఇన్స్టాగ్రామ్ లో పెయిడ్ పార్ట్నర్షిప్ పోస్ట్ కోసం దాదాపు రూ. 10 లక్షల నుంచి 20 లక్షలు చార్జ్ చేస్తుంది. అలాగే టీవీ ప్రకటనల కోసం దాదాపు రూ. 3 నుంచి 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. సాకీ దుస్తుల బ్రాండ్ ను కూడా సామ్ నడుపుతోంది.అంతే కాకుండా సమంత తన స్నేహితులతో కలిసి పలు వ్యాపారాలు చేస్తున్నట్లు సమాచారం.
Read More...
'నో మేకప్' సెల్ఫీతో దర్శనమిచ్చిన మీరా.. అందానికి నెటిజన్లు ఫిదా!






