బాక్సాఫీస్ వద్ద మీనాక్షి చౌదరీ ఊచకోత.. గోల్డెన్ చాన్స్ కొట్టేసిందిగా!

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-08 05:26:02  IST  )

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) ప్రస్తుతం వరుస విజయాలతో సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.

బాక్సాఫీస్ వద్ద మీనాక్షి చౌదరీ ఊచకోత.. గోల్డెన్ చాన్స్ కొట్టేసిందిగా!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) ప్రస్తుతం వరుస విజయాలతో సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అనతి కాలంలోనే ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న ఈ భామ వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ, తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. అయితే ఈ అమ్మడుకి ఇప్పుడు ఇతర భాషల నుంచి కూడా భారీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో ఘనవిజయాన్ని అందుకున్న మీనాక్షి, ఇటీవల విడుదలైన ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో వరుస అవకాశాలు వస్తున్నాయి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో ఆమె గోల్డెన్ లెగ్ అనిపించుకుంటూ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది.

తెలుగు, తమిళ భాషల్లో సత్తా చాటుతున్న మీనాక్షి, త్వరలోనే కన్నడ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం మీనాక్షిని కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం. గతంలో రక్షిత్ శెట్టి (Rakshit Shetty)నటించిన ‘777 చార్లీ’ చిత్రం రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన చేయబోయే కొత్త సినిమా ‘రిచర్డ్ ఆంథోనీ: లార్డ్ ఆఫ్ ది సీ’లో హీరోయిన్ పాత్రకు మీనాక్షి చౌదరి అయితేనే పూర్తి న్యాయం చేస్తుందని భావించిన చిత్ర బృందం, ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. రక్షిత్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రాబోతుండగా..ఈ భారీ ప్రాజెక్ట్‌ను హోంబలే ఫిలిమ్స్ (Hombale Films) నిర్మిస్తోంది. ఇక ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఇందుకు సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఒకవేళ రక్షిత్ శెట్టి సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే, అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్‌లో పాగా వేసిన నటిగా మీనాక్షి రికార్డు సృష్టించనుంది. కాగా.. ప్రస్తుతం తెలుగులో అక్కినేని నాగచైతన్య సరసన ‘వృషకర్మ’ చిత్రంలో మీనాక్షి నటిస్తోంది. 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా మైథలాజికల్ థ్రిల్లర్‌ను సుకుమార్ రైటింగ్స్ SVCC సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాగచైతన్య 24వ చిత్రంగా, డిఫరెంట్ యాక్షన్-అడ్వెంచర్ జోనర్‌లో రూపొందుతోంది. ఇందులో స్పర్ష్ శ్రీవాస్తావ కీలక పాత్రలోకనిపించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే కన్నడ నుంచి పిలుపు రావడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా రిలీజ్ కాకముందే మరో బంపరాఫర్ అందుకున్న ఇమాన్వీ.. ఆ స్టార్ హీరోతో రొమాన్స్

Next Story