సినిమా రిలీజ్ కాకముందే మరో బంపరాఫర్ అందుకున్న ఇమాన్వీ.. ఆ స్టార్ హీరోతో రొమాన్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2026-02-08 05:24:46  IST  )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.

సినిమా రిలీజ్ కాకముందే మరో బంపరాఫర్ అందుకున్న ఇమాన్వీ.. ఆ స్టార్ హీరోతో రొమాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. హరీష్ శంకర్(Hareesh Shankar) దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela)తో పాటు రాశీ ఖన్నా(Rashi Khanna) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత పవన్ మార్చి నెలలో మరో భారీ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఇక దీనికి ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి(surender Reddy) దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాను మార్చి 19న ఉగాది సందర్భంగా గ్రాండ్‌గా ప్రారంభించబోతున్నారని టాక్. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ మూవీను నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమాలో హీరోయిన్‌గా ఓ యంగ్ బ్యూటీ ఫిక్స్ అయినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ‘ఫౌజీ’(Fauji) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఇందులో హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ ఇమాన్వి(Imanvi) నటిస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ఈ చిన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తన నెక్స్ట్ ప్రాజెక్టులో యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఫౌజీ సినిమా రిలీజ్ కాకముందే ఈ ముద్దుగుమ్మ మరో బంపరాఫర్ అందుకోవడం అదృష్టమనే చెప్పాలి. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్ రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడిని భరించడం నావల్ల కావట్లేదు బాబోయ్.. షాకింగ్ వీడియోతో ట్విస్ట్ ఇచ్చిన నిహారిక!

Next Story