- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంతో మంది తల్లులు నాకు ఫోన్ చేసి ఆ విషయం గురించి చెప్తున్నారు.. తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia) ఓ హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia) ఓ హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సిద్ధార్థ్ మల్హోత్రా(Siddharth Malhotra), దీపక్ మిశ్రా కాంబినేషన్లో రాబోతున్న ‘వ్యన్’ మూవీలో తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. బాలాజీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్ బ్యానర్‌పై ఎక్తా కపూర్ నిర్మిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా మే 15న విడుదల కానుంది. తమన్నా ఓ వైపు హీరోయిన్గా నటిస్తూనే మరో వైపు స్పెషల్ సాంగ్ చేస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ఆజ్ కీ రాత్ వింటేనే నా బిడ్డ ఆహారం తింటాడు అని నాకు ఫోన్ చేసి చెప్పిన తల్లుల సంఖ్య నేను చెప్పలేను. పిల్లలు నచ్చింది కనిపిస్తే అలాగే చేప్తుంటారు. తల్లులు చింతించాల్సిన విషయం తమ పిల్లలు సరిగ్గా తింటున్నారా లేదా అని అంతేకానీ ఎలాంటి పాల వింటున్నారు అని కాదు. అయినా ఏడాది వయసు పిల్లలు ఏ లిరిక్స్‌ను అర్థం చేసుకుంటారు. కేవలం మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తారు. కొన్నిసార్లు మనం సినిమాలను మర్చిపోతాం కానీ సాంగ్స్ గుర్తుంచుకుంటాం ఇది నిజం’’ అని చెప్పుకొచ్చింది. కాగా, తమన్నా భాటియా ‘స్త్రీ-2’ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందులో ఆజ్ కీ రాత్ సాంగ్‌లో ఆడి పాడింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు తమన్నా చేసిన సాంగ్ విపరీతమైన వ్యూస్, లైక్స్‌ను రాబట్టింది.
ఆ డైరెక్టర్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!






