- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ డైరెక్టర్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ యంగ్ బ్యూటీ కోమలి ప్రసాద్( Komali Prasad) ‘నేను సీతా దేవి’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ కోమలి ప్రసాద్( Komali Prasad) ‘నేను సీతా దేవి’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రౌడీ బాయ్స్(Rowdy boys), అనుకున్నది ఇకటి అయింది ఒకటి వంటి మూవీస్ చేసి అమ్మడు అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ‘హిట్-3’ (Hit-3’)సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ ఒక్క ప్రాజెక్ట్‌తో అమ్మడు రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం ‘శశివదనే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కోమలి ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘శైలేష్ కొలను సెట్‌లో మాట్లాడే భాషనే నాకు పెద్ద సమస్యగా అనిపించింది. తెలుగును విరగగొట్టి మాట్లాడటం వల్ల అర్థం కాదు. ఎక్స్‌ప్రేషన్ ఇవ్వకుండా మాట్లాడతారు. మొదట్లో ఆయన స్టైల్ అర్థం కాక ఇబ్బంది పడ్డాను. కానీ ఆయన ఇచ్చిన అవకాశం వల్లనే మంచి విజయం సాధించాను. శైలేష్ కొలనుతో పని చేయడం నిజంగా గొప్ప అనుభవం’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






