- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘సూర్య-47’సినిమాలో మలయాళ భామ కన్ఫర్మ్.. అధికారిక ప్రకటనతో సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya) నటిస్తున్న ‘సూర్య 47’ చిత్రం హాట్ టాపిక్‌గా మారింది

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya) నటిస్తున్న ‘సూర్య 47’ చిత్రం హాట్ టాపిక్‌గా మారింది. వరుసగా కథా ప్రధాన చిత్రాలతో, సోషల్ మెసేజ్‌లు ఉన్న స్క్రిప్ట్‌లతో సక్సెస్ అందుకున్న సూర్య ఈసారి పూర్తిగా మాస్ యాక్షన్ జానర్‌లోకి అడుగుపెడుతున్నాడనే టాక్ ఇండస్ట్రీలో హీటెక్కిస్తోంది. ఇప్పటికే ఆయన కొత్త లుక్, బల్క్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఆయన కెరీర్‌లో ఇది అత్యంత హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో గట్టిగా ఉంది.
ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటులు నటిస్తున్నారన్న రూమర్స్ ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. హీరోయిన్ నుంచి విలన్ వరకు చాలా పేర్లు చర్చలోకి రావడంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో.. తాజాగా మూవీ మేకర్స్ అధికారికంగా స్పందించి వస్తున్న అన్ని ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇదే సమయంలో ముఖ్యమైన నటీనటులను కూడా ఫైనల్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. నేడు చెన్నైలో ఘనంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో సూర్యతో పాటు ఆయన భార్య జ్యోతిక కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘సూర్య-47’ వర్కింగ్ టైటిల్ తెరకెక్కబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది.
‘ఆవేశం’ మూవీతో సంచలనం సృష్టించిన జీతూ మాధవన్ (Jeethu Madhavan)దర్శకత్వంలో వహిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ చిత్రంలో సూర్యతో పాటు మలయాళ యంగ్ హీరో నస్లేన్, మలయాళ క్యూట్ బ్యూటీ నజ్రియా నజీమ్(Nazriya Nazim) కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. చాలాకాలం తర్వాత నజ్రియా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇందులో ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సుశిన్ సంగీతం అందిస్తున్నారు.






