కేరళ అడవుల్లో ‘మైసా’ షూటింగ్.. ఫుల్ యాక్షన్ మోడ్‌లో నేషనల్ క్రష్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-26 11:59:37  IST  )

ప్రస్తుతం కేరళలోని దట్టమైన అడవుల్లో ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ జరుగుతోంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ కెచా నేతృత్వంలో దాదాపు 15 నుండి 16 రోజుల పాటు ఈ హై-వోల్టేజ్ పోరాట ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.

కేరళ అడవుల్లో ‘మైసా’ షూటింగ్.. ఫుల్ యాక్షన్ మోడ్‌లో నేషనల్ క్రష్!
X

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత సాహసోపేతమైన పాత్రకు సిద్ధమవుతోంది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మైసా’ చిత్రంలో ఆమె మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్‌ఫుల్ గోండు గిరిజన యువతిగా కనిపించబోతోంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా వస్తున్న అప్‌డేట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రష్మిక ఈ పాత్ర కోసం ఎంతలా కష్టపడుతుందో రీసెంట్‌గా దర్శకుడు పంచుకున్న ఫోటోలే సాక్ష్యం. బ్యాంకాక్ వెళ్ళి మరీ అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో ఆమె సుమారు 8 గంటల పాటు కఠినమైన మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంది. ఆండి లాంగ్ గతంలో జాకీ చాన్ సినిమాలతో పాటు ‘కల్కి 2898 AD’ వంటి భారీ చిత్రాలకు పనిచేసిన అనుభవం ఉంది. రష్మిక ఈ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం డూప్ లేకుండా సొంతంగా కష్టపడుతుండటం విశేషం. ప్రస్తుతం కేరళలోని దట్టమైన అడవుల్లో ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ జరుగుతోంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ కెచా నేతృత్వంలో దాదాపు 15 నుండి 16 రోజుల పాటు ఈ హై-వోల్టేజ్ పోరాట ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.

కెచా మాస్టర్ గతంలో 'పుష్ప 2', 'పొన్నియిన్ సెల్వన్' వంటి చిత్రాలకు అద్భుతమైన యాక్షన్ కంపోజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రష్మిక కోసం పక్కా ‘రా’ అండ్ ఇంటెన్స్ ఫైట్స్ ప్లాన్ చేశారు. గిరిజన మహిళగా రష్మిక మేకోవర్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతోందట. ఇది అభిమానులకు పెద్ద షాక ఇవ్వనున్నట్లు మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖంపై గాయాలు, మసి పూసుకున్న రష్మిక ఇంటెన్స్ లుక్ ఇప్పటికే ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఇది గోండు గిరిజనుల సంస్కృతి, వారి పోరాటాల నేపథ్యంలో సాగే ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రతబోతుంది. ‘భ్రమయుగం’, ‘పొయ్యి’ చిత్రాల ఫేమ్ జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందుతోంది. విజయ్ దేవరకొండతో వివాహం తర్వాత రష్మిక తిరిగి షూటింగ్‌లలో బిజీ అయిపోయింది. ‘పుష్ప 2’తో పాటు ఆమె నటిస్తున్న ఈ ‘మైసా’ చిత్రం ఆమె కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

అడవి బాట పట్టిన రష్మిక.. సినిమాకు హైలెట్‌గా ఈ హై-వోల్టేజ్ సీన్స్

Next Story