- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడవి బాట పట్టిన రష్మిక.. సినిమాకు హైలెట్‌గా ఈ హై-వోల్టేజ్ సీన్స్
రష్మిక మందన్న నటిస్తున్న ‘మైసా’ సినిమాకు షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది.

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం పెళ్లి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే.. సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఈ హీరోయిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘మైసా’. ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని ఒక వినూత్నమైన కథాంశంతో దర్శకుడు రవీంద్ర పుల్లె తీర్చిదిద్దుతున్నాడు. అన్‌ఫార్ములా ఫిల్మ్ సంస్థ ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తోన్న ఈ మూవీ ప్రస్తుతం కేరళలోని దట్టమైన అడవుల్లో ఒక హై-వోల్టేజ్ పోరాట సన్నివేశానికి సిద్ధమైంది. దాదాపు 15 రోజుల పాటు సాగే ఈ కీలక షెడ్యూల్‌లో కేవలం భారీ యాక్షన్ సన్నివేశాలనే తెరక్కెక్కిస్తున్నారు. హీరోయిన్ రష్మిక తనలోని అసలైన వీరత్వాన్ని ప్రదర్శించేలా ఈ ఫైట్స్ ఉండబోతున్నట్లు తెలుస్తుండగా.. ఈ అడవిలో జరిగే పోరాటా సీన్స్ సినిమాకు మెయిట్ ఎట్రాక్షన్‌గా నిలవనున్నట్లు చెబుతున్నారు మేకర్స్.
కాగా.. ఈ సినిమా గురించి రీసెంట్ ఇంటప్వ్యూలో పాల్గొన్న రష్మిక మాట్లాడుతూ.. ‘డియర్ కామ్రేడ్, గుడ్‌బై, ది గర్ల్‌ఫ్రెండ్ వంటి చిత్రాలకు విస్తృత ప్రేక్షకాదరణ లభించింది. నిజానికి, ఈ చిత్రాలే నన్ను ఒక శక్తివంతమైన నటిగా నిలబెట్టాయి. ఇక ఇప్పుడు మైసాలో నా నటనను కూడా అంతే స్థాయిలో ప్రేక్షకులు ఇష్టపడతారని నాకు పూర్తి నమ్మకం ఉంది’ అని తెలిపింది. రష్మిక కామెంట్స్‌తో ‘మైసా’ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి.






