బిగ్‌బాస్‌లో లిప్ లాక్ టాస్క్.. మైమరిచిపోయి 30 సెకండ్ల పాటు.. (వీడియో)

by Disha Web Desk 4 |
బిగ్‌బాస్‌లో లిప్ లాక్ టాస్క్.. మైమరిచిపోయి 30 సెకండ్ల పాటు.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ‘బిగ్ బాస్ ఓటీటీ 2’లో ఓ టాస్క్ వివాదాస్పదమవుతోంది. జైద్ హదీద్, ఆకాంక్ష ముద్దులు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూన్ 17 నుంచి జియో సినిమాలో ఈ ప్రొగ్రామ్ ప్రసారం అవుతోంది. బిగ్ బాస్ తాజాగా డేర్ గేమ్ పేరుతో ఓ టాస్క్ ఇచ్చాడు. పోటీలో పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కానీ కొంత టైం తర్వాత జైద్ హదీద్, ఆకాంక్ష పూరి గేమ్ లో పాల్గొన్నారు. 30 సెకన్ల పాటు షోలో ముద్దు పెట్టుకున్నారు.

ఆ తర్వాత సేమ్ ఇదే టాస్క్ ను మరికొంత మంది కంటెస్టెంట్స్ చేశారు. అయితే తాజాగా వీడియో వైరల్ కావడంతో ఇది చూసిన నెటిజన్లు ఇవేం టాస్క్ లు అంటూ షో నిర్వాహకులపై ఫైర్ అవుతున్నారు. సమాజంపై ఎఫెక్ట్ చూపే ఈ పిచ్చి పనులు ఏంటని మండి పడుతున్నారు. అంతకు ముందు ఇదే షోలో జైద్ హదీద్ పూరి ఆకాంక్షను తప్పుగా తాకినప్పుడు ఆమె గొడవకు దిగింది. తాజాగా ముద్దుల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: ముస్లిం ఆచారంపై యాంకర్ రష్మీ ట్వీట్.. ఆంటీ అంటూ ఫైర్ అవుతున్న నెటిజన్స్

Next Story