అందం ఒకే ఫ్రేమ్‌లో బంధించబడిందంటున్న.. నెటిజన్స్

by Prasanna |
అందం ఒకే ఫ్రేమ్‌లో బంధించబడిందంటున్న.. నెటిజన్స్
X

దిశ, సినిమా: దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్‌ 2023లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి నెటిజన్లను అలరించింది స్టార్ నటి కీర్తిసురేశ్. థిక్‌ బ్లూ డ్రెస్‌లో కాటుక కనులతో మెరిసిపోతూ ఆమె హొయలుపోయింది. సహనటులతో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేసింది. ఇక ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు రెడ్‌ డ్రెస్‌లో కళ్యాణి ప్రియదర్శణ్‌, బ్లాక్ కాస్ట్యూమ్స్‌లో శృతిహాసన్‌ దర్శనమిచ్చి అట్రాక్ట్ చేయగా వీరిద్దరూ కీర్తిసురేశ్‌‌కు ఇరుపక్కల కూర్చొని ఫొటోలకు పోజులిచ్చారు. కాగా ఈ ముగ్గురు తమ హాట్ లుక్స్‌తో నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలవగా.. ఒకే ఫ్రేమ్‌లో అందం బంధించబడింది అంటూ పొగిడేస్తున్నారు అభిమానులు. ముఖ్యంగా మహానటి రేంజ్ అంటే ఇది అంటూ కీర్తిని ఆకాశానికెత్తేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : ఉన్నది ఒక్కటే బటన్.. అది కూడా ఊడితే ఇక అంతే సంగతి.. నటిపై బోల్డ్ కామెంట్స్

Next Story

Most Viewed