- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సినిమాకు ఆశించినంత గుర్తింపు రాలేదు.. ఏడేళ్లు నరకం చూశా
బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ 2011 నుంచి 2018 వరకూ తన కెరీర్‌ను గడ్డుకాలంగా పేర్కొన్నాడు.

X
దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ 2011 నుంచి 2018 వరకూ తన కెరీర్‌ను గడ్డుకాలంగా పేర్కొన్నాడు. అంతేకాదు 2011లో వచ్చిన ‘ప్యార్ కా పంచ్‌నామా’ సినిమా తర్వాత తనకు ఆశించినంత గుర్తింపు రాలేదని, దీంతో మానసికంగా కుంగిపోతూ చాలా ఒత్తిడికి లోనయినట్లు తెలిపాడు. ‘‘‘ప్యార్ కా పంచ్‌నామా’తో నా కెరీర్ మారిపోతుందనుకున్నా. కానీ, నేను ఊహించనట్లు జరగలేదు. అనుకున్నంత పేరు రాలేదు. అవకాశాలు అంతంతమాత్రమే. అయితే ఎట్టకేలకు 2018లో వచ్చిన ‘సోను కే టిటు కి స్వీటీ’తో నేను కోరుకున్న గుర్తింపు లభించింది. ఈ రెండు సినిమాల మధ్య గడిచిన ఆ ఏడేళ్లు నా జీవితంలో అతిపెద్ద పోరాటంలాంటివే’ అంటూ కెరీర్ స్ట్రగులు గురించి చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
Next Story






