సెలబ్రిటీ సెక్స్ సీక్రెట్స్ అంటే చాలా ఇష్టం: స్టార్ నిర్మాత Karan Johar

by Hajipasha |   (  Updated:2022-10-11 09:10:21  IST  )

Karan Johar on getting trolled for discussing celebs' sex lives on KWK 7, says 'Maybe I'm curious.

సెలబ్రిటీ సెక్స్ సీక్రెట్స్ అంటే చాలా ఇష్టం: స్టార్ నిర్మాత Karan Johar
X

దిశ, సినిమా: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తుంటాడు. ముఖ్యంగా 'కాఫీ విత్ కరణ్‌'‌ షోలో సెలబ్రిటీ పర్సనల్ లైఫ్, సెక్స్, కెరీర్ గురించి ఎన్నో విషయాలను బయటపెట్టి విమర్శల పాలయ్యాడు. అతిథుల శృంగార జీవితం గురించి ఎందుకంత ఇంట్రెస్ట్ అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు.

దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన కరణ్.. 'నేను ఎప్పుడూ నాకు నచ్చింది చేయాలనుకున్నా. 'కాఫీ విత్ కరణ్ షో' చేయడం ఆనందాన్ని కలిగించింది. అయితే కొంతమంది అలియా గురించి, సెలబ్రిటీ లైంగిక జీవితాల గురించి ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నావంటూ దారుణంగా తిడుతున్నారు. కానీ, అవన్నీ పెద్దగా పట్టించుకోను. బయట వ్యక్తుల సెక్స్ సీక్రెట్స్ తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే అలాంటి ప్రశ్నలు వేస్తా' అంటూ చెప్పుకొచ్చాడు. చివరగా ఇది కేవలం టాక్ షో అని గుర్తించాలన్న కరణ్.. ఇందులో రకరకాల ప్రశ్నలు వేస్తుంటామని, వాటి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని ముగించాడు.

ఇవి కూడా చదవండి : ఒక్కసారైనా ఆయనలా జీవించాలనుకుంటున్నాను: సోనాక్షి

Next Story