ఒక్కసారైనా ఆయనలా జీవించాలనుకుంటున్నాను: సోనాక్షి

by Dishanational4 |
ఒక్కసారైనా ఆయనలా జీవించాలనుకుంటున్నాను: సోనాక్షి
X

దిశ, సినిమా : బ్యూటీఫుల్ యాక్ట్రెస్ సోనాక్షీ సిన్హా సహనటుడు జహీర్ ఇక్బాల్ క్యారెక్టర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. వీరిద్దరూ కలిసి నటించిన 'బ్లాక్ బస్టర్' వీడియో సాంగ్ ఇటీవలే విడుదలవగా మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే నటీనటుల మధ్య కెమిస్ట్రీపై మాత్రం ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా ఓ సమావేశంలో పాల్గొన్న స్టార్స్ రాపిడ్ రౌండ్‌లో ఒకరినొకరు పొగిడేసుకున్నారు.

మీరు అనుకోకుండ ఒకరోజు జహీర్ ఇక్బాల్‌గా మారిపోతే ఏం చేస్తారు? అని సోనాను ప్రశ్నించగా.. జహీర్‌ను చురుకైన వ్యక్తిగా పేర్కొంటూ అది తనకు వెరీ స్పెషల్ డేగా భావిస్తానని చెప్పింది. అలాగే నిరంతరం ఏదో ఒక పనిచేస్తూ కనిపించే నటుడు.. సెలవు రోజు కూడా రెస్ట్ తీసుకోడని, తనకు ఆ చాన్స్ దొరికితే ఎంతో ఇష్టంగా చెట్లు నాటుకుంటూ గడిపేస్తాడని తెలిపింది. ఇక అతడు ప్రతీ రోజును 10 విభిన్నమైన పనులతో నింపేస్తాడన్న సోనా.. అలాంటి ఒక రోజును ఒక్కసారైనా తాను జీవించాలనుకుంటున్నట్లు వెల్లడించింది. ఇక వీరిద్దరూ కలిసి నటించిన అప్ కమింగ్ మూవీ 'డబుల్ XL' 2022 నవంబర్ 4న విడుదలకానుంది.

ఇవి కూడా చదవండి : సెలబ్రిటీ సెక్స్ సీక్రెట్స్ అంటే చాలా ఇష్టం: స్టార్ నిర్మాత Karan Johar

Next Story