ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన 'Kantara'

by Disha Web Desk 10 |
ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన Kantara
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కన్నడ చిత్రం 'కాంతారా'. ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి కన్నడ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇకపోతే.. ఈ మూవీ ఆస్కార్ అవార్డులకు క్వాలిఫై అయినట్లు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ ప్రకటించింది. 'ఈ ఏడాది ప్రకటించే 95వ ఆస్కార్ అవార్డులకు 'కాంతారా'ను కూడా నామినేషన్‌లో చేర్చాలని' హోంబలే ఫిలిమ్స్ అప్లికేషన్ పెట్టుకుంది. ఇప్పుడీ రెండు విభాగాల్లోనూ క్వాలిఫై అయినట్లు ఆ సంస్థ తెలిపింది.

Read more:

రిమైండర్ లిస్ట్ ప్రకటించిన ఆస్కార్ అకాడమీ.. భారత్ నుంచి 4 సినిమాలకు చోటు

Next Story

Most Viewed