టెక్నాలజీ డెవలప్ అయింది.. సెక్స్ కోసం మగాళ్లతో పనిలేదంటోన్న సోనీ

by Disha Web Desk 7 |
టెక్నాలజీ డెవలప్ అయింది.. సెక్స్ కోసం మగాళ్లతో పనిలేదంటోన్న సోనీ
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటి కనిష్క సోని తనను తాను వివాహం చేసుకుని ప్రపంచదృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. అయితే తన నిర్ణయంపై సర్వత్రా వ్యక్తమవుతున్న విమర్శలపై తాజాగా స్పందించింది. ఈ మేరకు మెడలో మంగళసూత్రంతో కూడిన ఫొటోలతో పాటు ఓ సుదీర్ఘ నోట్‌ను నెట్టింట షేర్ చేసింది. 'నా కలలన్నీ సొంతంగా నెరవేర్చుకున్నా. అందుకే నన్ను నేను వివాహం చేసుకున్నా. అవసరాలు తీర్చుకోవడమే కాదు లవ్ చేయడానికి కూడా మరో వ్యక్తి అవసరం లేదు.

అలాగని నేను సైన్స్‌ను విస్మరించలేదు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది కాబట్టి సెక్స్ లైఫ్ గురించి ఆందోళన లేదు. స్త్రీకి సెక్స్ కోసం ఇకపై పురుషుడి అవసరం లేదు. పైగా 90 శాతం మంది మహిళలు పెళ్లి తర్వాత సంతోషంగా లేరు. అందుకే పురుషులపై నమ్మకం పోయింది. పెళ్లనేది కేవలం సెక్స్ కోసమే కాకుండా ప్రేమ, నిజాయితీకి ప్రతిరూపంలా నిలవాలి. నేను గంజాయి తాగి మాట్లాడట్లేదు. మద్యం సేవించే అలవాటు కూడా లేదు. సగటు భారతీయ సంప్రదాయ మహిళని' అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చ‌ద‌వండి : అదే పనిగా సెక్స్‌లో పాల్గొంటున్నారా?


Next Story