అదే పనిగా Sex లో పాల్గొంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి

by Disha Web |
అదే పనిగా Sex లో పాల్గొంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
X

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యకరమైన సెక్స్ జీవితమంటే ఎక్కువసార్లు సెక్స్ చేయడం కాదు.క్వాలిటీ, క్వాంటిటీ మధ్య సమతుల్యత పాటించడం. ఇది ఒక్కో జంటలో ఒక్కో విధంగా ఉండవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం సగటు వయోజనుడు ఏడాదికి 54సార్లు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటాడు. అంటే వారానికొక సెక్స్ సెషన్ సరిపోతుంది. అయితే పార్ట్‌నర్స్ ఇద్దరూ సుఖంగా ఉన్నంత వరకు, ఎక్కువసార్లు సెక్స్ చేసినప్పటికీ శారీరక సమస్యలు లేనంత వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు అతిగా లేదా తరచుగా సెక్స్ చేయడం మాత్రం కచ్చితంగా శరీరంపై ప్రభావం చూపిస్తుంది. అవేంటో తెలుసుకోండి..

* యోని పొడిబారడం

సుదీర్ఘ సెక్స్ సెషన్ వల్ల ఎదుర్కొనే మొదటి లక్షణం యోని పొడిబారడం. శరీరంలోని సహజ ద్రవాలు క్షీణించడం వల్ల డ్రైనెస్ ఏర్పడి నొప్పి, ఘర్షణకు కారణమవుతుంది. రుతుక్రమం ఆగిన మహిళల్లో యోని పొడిబారడం సర్వసాధారణమే. కాగా ఇది అంగప్రవేశం, లైంగిక సంపర్కం సమయంలో తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

* వాపు

సంభోగం తర్వాత బాహ్య చర్మం, జెనెటిల్ పార్ట్స్(వల్వా, లాబియా) ఉబ్బిపోయి ఉంటే పూర్వస్థితికి వచ్చేదాకా సెక్స్‌కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది యోని ప్రాంతంలో మరింత నొప్పిని కలిగిస్తుంది. ఉపశమనం కోసం ఐస్ ప్యాక్‌ ప్రయత్నించవచ్చు. సుదీర్ఘ సెక్స్ సెషన్‌ సందర్భంగా యోనిలో తేమ సృష్టించేందుకు లూబ్రికేషన్‌ ఉపయోగించాలి.

* సెక్స్ సమయంలో నొప్పి/మంట

శృంగార క్రీడ ఆనందాన్ని ఇచ్చినప్పటికీ అతిగా చేస్తే జననేంద్రియ నొప్పికి కారణం కావచ్చు. ఇలాంటి నొప్పి నిరంతరం వేధిస్తుంటే మాత్రం వైద్యుడిని సంప్రదించాలి. సెక్స్ సమయంలో లేదా తర్వాత యోనిలో మంట లాంటి అనుభూతి అసౌకర్యంగా ఉంటుంది. ఇది మీరు ఆపివేయాలని లేదా విరామం తీసుకోవాలని సూచించవచ్చు.

* యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్

నొప్పి, పొడిబారడం, చికాకు, మంటలు, దద్దుర్లు వంటివి ఎక్కువగా సెక్స్‌తో ముడిపడిన లక్షణాలు. మూత్రాశయం, యోని ఇన్‌ఫెక్షన్ అనేది మరొక బాధాకరమైన లక్షణం. అంటే మీరు ఎక్కువసార్లు సెక్స్‌లో పాల్గొంటే అంటువ్యాధులు పొందే అవకాశం కూడా ఎక్కువే.

హెల్తీ సెక్స్ సెషన్ కోసం చిట్కాలు :

* సుదీర్ఘ సెషన్ సెక్స్‌లో పాల్గొనేందుకు లూబ్రికెంట్స్ ఉపయోగిస్తే పొడిబారే సమస్య తగ్గుతుంది.

* శరీరాలు ఉద్రేక స్థితికి చేరుకునేందుకు తప్పనిసరిగా ఫోర్‌ప్లే చేయాలి.

* సెక్స్ సమయంలో భరించలేని నొప్పిని అనుభవిస్తే యాంగిల్ మార్చుకోవాలి.

* కటి కండరాలను బలోపేతం చేసేందుకు కెగెల్ వ్యాయామాలు చేయాలి. ఇది మూత్రాశయానికి మద్దతునిస్తుంది. భావప్రాప్తిని సులభతరం చేస్తుంది.

* సంభోగం సమయంలో సమస్యలు ఎదుర్కొంటుంటే విరామం తీసుకోవాలి.

ఇవి కూడా చ‌ద‌వండి : నీ కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం.. నటి బోల్డ్‌ షోపై కామెంట్స్

Next Story

Most Viewed