- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొడిమ్యాల ఫారెస్ట్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఫారెస్ట్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది.

X
దిశ, కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఫారెస్ట్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. మధ్యాహ్నం సమయంలో కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ బృందం కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని పలు రికార్డులు, పత్రాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సోదాలు ఎవరైనా వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా జరుగుతున్నాయా, లేక అవినీతి ఆరోపణల నేపథ్యంలో సాధారణ తనిఖీల్లో భాగంగా నిర్వహిస్తున్నారా అనే విషయంపై అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. సోదాల కారణాలు, వివరాలపై ఏసీబీ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఫారెస్ట్ కార్యాలయంలో జరుగుతున్న ఈ తనిఖీలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. సోదాలు పూర్తయిన అనంతరం ఏసీబీ అధికారులు వెల్లడించే వివరాల పై ఆసక్తి నెలకొంది.
Next Story






